మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు.  దేశముదురు, బన్ని, ఆర్య లాంటి మూవీస్ తో మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఫ్యాన్స్ స్టైలిష్ స్టార్ గా పిలుచుకుంటారు. అయితే కెరీర్ పరంగా బన్నీ నటించిన సినిమాలు దాదాపు అన్నీ హిట్ టాక్ తెచ్చుకున్నవే.. కలెక్షన్లు కూడా బాగానే రాబట్టాయి. కానీ ఈ మద్య వస్తున్న స్టార్ హీరోల సినిమాలు రూ.100 కోట్ల క్లబ్ లో ఈజీగా చేరిపోతున్నాయి.. అంతే కాదు ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతున్నాయి. ఇక బన్నికెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా ఉన్న సరైనోడు, రేసు గుర్రం వంటి మూవీస్ కూడా ఓవర్సీస్ లో కనీసం $1.5 మిలియన్ మార్క్ చేరుకోలేక పోయాయి. దాంతో తన సినిమా $2 మిలియన్ మార్క్ ఏప్పుడు చేరుకుంటుందా అని కలలు కనేవారట. 

 

సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించిన ‘అల వైకుంఠపురంలో’ మూవీ  మంచి సక్సెస్ సాధించి అనేక కొత్త రికార్డ్స్ నమోదు చేస్తుంది.  బన్నీ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ మూవీ యూఎస్ లో $ 2 మిలియన్ క్లబ్ హీరోల సరసన చేర్చింది. ఎప్పటి నుండో బన్నీకి అందని ద్రాక్షలా ఉన్న ఈ ఫీట్ అల వైకుంఠపురంలో మూవీతో సాకారం కావడంతో.. బన్నీ తాను కన్న కల నెరవేరినందుకు మహదానందంగా ఉన్నారట. రేపు ఆదివారం విశాఖ వేదికగా గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు. అలాగే 24 న తిరుపతిలో మరో సక్సెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇక బన్నీకి మాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. 

 

మూవీ మలయాళంలో కూడా విడుదలైన నేపథ్యంలో కేరళ, కర్ణాటకలో కూడా సక్సెస్ మీట్స్ ప్లాన్ చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ నిర్మించాయి. బన్నీ సరసన పూజ హెగ్డే నటించగా, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు వంటి వారు కీలక రోల్స్ చేశారు. ఈ మూవీలో ప్రముఖ దర్శకులు సముద్రకని విలన్ గా నటించారు.  థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. థమన్ అందించిన  అందించిన సంగీతం సినిమాకు మంచి ప్లస్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: