టాలీవుడ్ సినిమా పరిశ్రమకు సంబంధించి కొన్నేళ్ల క్రితం నెలకొల్పబడిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంస్థ, సినిమాల్లో నటించే నటీనటుల సమస్యలను తెలుసుకుని, ఎప్పటికపుడు తగు నిర్ణయాలతో వాటిని పరిష్కరించే దిశగా ముందుకు సాగుతోంది. అయితే ఇటీవల మా అసోసియేషన్ లో కొందరు వ్యక్తుల వ్యక్తిగత విభేదాల కారణంగా అసోసియేషన్ రెండుగా చీలిపోయింది. గత మా అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన శివాజీ రాజా, పై అప్పట్లో నరేష్ వర్గం విమర్శలు చేయగా, మొన్నటి మా ఎన్నికల్లో నరేష్ గెలవడంతో ప్రస్తుతం శివాజీరాజా సహా మిగిలిన వారు నరేష్ వర్గంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 

 

ఇక ఇటీవల జరిగిన మా అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సభలో నటుడు రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరు, మోహన్ బాబు, పరుచూరి సోదరులు, కృష్ణంరాజు, మురళీమోహన్, సహా మరికొందరు అతిథులు స్టేజిపై కూర్చొని ఉండగా, మా లో విబేధాలు ఉన్నాయని, వాటిని చిరంజీవి సహా మరికొందరు కప్పిబుచ్చుతున్నారని విమర్శించాడు. అయితే రాజశేఖర్ మాట్లాడిన పద్దతిని మిగతావారందరూ తప్పుబట్టారు. ఇక నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానం చేరుకున్న సీనియర్ నటుడు సుమన్, అక్కడి మీడియాతో మాట్లాడారు. నిజానికి మా డైరీ ఆవిష్కరణ సభలో రాజశేఖర్ మాట్లాడిన విధానం సరైనది కాదని అన్నారు. 

 

రాజశేఖర్ వాస్తవంగా మంచి వ్యక్తి అని, అయితే అతడికి కోపం మాత్రం బాగా ఎక్కువని చెప్పడం జరిగింది. చిరంజీవి గారు చెప్పిన మాదిరిగా అసోసియేషన్ లో మంచి ఏదైనా ఉంటె, అది అందరి ముందు చెప్పి, తప్పులు ఏమైనా ఉంటె అందరం కలిసి ప్రత్యేకంగా మాట్లాడుకుని సరిచేసుకునే విధానం కరెక్ట్ అని అన్నారు. కావున ఇకనైనా రాజశేఖర్ ఆవేశం తగ్గించి ఆలోచనతో కనుక వ్యవహరిస్తే తప్పకుండా మెల్లగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని సుమన్ చెప్పడం జరిగింది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: