శ్రీరెడ్డి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  కాంట్రవర్సీ, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.  ఒక రకంగా చెప్పాలేంటే..  శ్రీరెడ్డి పేరు వింటే చాలు తెలుసు సినిమా పరిశ్రమ అదిరిపోతోంది.  వామ్మో ఆమేనా అని భయపడుతుంది.  కారణం.. క్యాస్టింగ్ కౌచ్ పై ఆమె చేసిన పోరాటమే.  సినిమా పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి ఎందరో వాడుకొని వదిలేస్తున్నారని చెప్పి పోరాటం చేసింది. అయితే శ్రీరెడ్డిలా తాము మోసపోయామని ఆమెకు ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులు, మహిళా సంఘాలు చివరికి విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. దగ్గుబాటి కుటుంబం గురించైతే బీభత్సం సృష్టించింది.  దగ్గుబాటి కుటుంబాన్ని ఆ రేంజ్ లో విమర్శలు చేసిన వ్యక్తులు మరొకరు ఉండకపోవచ్చు.

 

ఆ సమయంలో తనను చాలా మంది బెదిరిస్తు్నారని ఆరోపణలు కూడా చేసింది. అయితే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమం బాగా సాగుతున్న సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ని దూషించడంతో అంతా రివర్స్ అయ్యింది.  ఆమెపై పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేశారు. దాంతో ఆమె చెన్నైకి మకాం మార్చి సొంతగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది. అక్కడ కూడా పలువురు సెలబ్రెటీలపై తనకు తోచిన కామెంట్స్ చేస్తూనే ఉంది. అయితే  క్యాస్టింగ్ కౌచ్ తో బాగా విసిగిపోయిన శ్రీరెడ్డి మెల్లిగా దాని నుంచి బయటకు వచ్చి గరిటపట్టి వంటలు చేస్తున్నది.  వెజ్, నాన్ వెజ్ వంటలు చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నది.  

 

మొన్నటి వరకు మైక్ పట్టి మంటలు పెట్టిన శ్రీరెడ్డి ఉన్నట్టుండి వంటలు చేయడం మొదలు పెట్టింది. శ్రీరెడ్డి అఫిషియల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వంటలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంది. సంక్రాంతి ఫెస్టివల్ వీడియోలు, స్పెషల్ వంటకాలను పోస్ట్ చేస్తుంది. శ్రీరెడ్డి వంటల వీడియోలు చూస్తున్న వారంతా శ్రీరెడ్డిలో ఈ కోణం కూడా ఉందా….? అని కొందరు, ఇప్పటికైనా రైట్ ట్రాక్‌లోకి వచ్చిందని కొందరు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైతే ఓకే మళ్లీ ఎలాంటి ఉపద్రవాలతో సెలబ్రెటీలపై విరుచుకుపడుతుందో అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: