ఈ మద్య బాలీవుడ్ లో ఎక్కువగా చారిత్రాత్మక బయోపిక్ మూవీస్ వస్తున్నాయి. ఆ మద్య సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ ఎన్నో విమర్శలు ఎదుర్కొని మంచి విజయం అందుకుంది.  ఆ తర్వాత కంగాన రౌనత్ నటించిన ‘మణికర్ణిక’ మూవీ సైతం వివాదాల మద్య విడుదలై మంచి విజయం అందుకుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్, కాబోల్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘తానాజీ’. ఈ నెల 10వ తేదీన విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది.  ‘తానాజీ: ది అన్‌ సంగ్‌ వారియర్‌’ మొదటి నుంచి భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ వచ్చింది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సైన్యాధ్యక్షుడు తానాజీ మలుసరే జీవితాధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జనవరి 10న రిలీజ్ అయ్యింది.

 

దక్షిణ భారతదేశ రాజధానిగా కొందనా కోట ప్రాంతాన్ని ఔరంగజేబు ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ కోట ప్రాంతాన్ని కాపాడి దక్షిణ భారతదేశం మొఘలుల చేతుల్లోకుండా చూడాలని శివాజీ ఆదేశిస్తాడు. ఈ నేపథ్యంలో తానాజీ వారిపై ఎలా పోరాడాడు...యుద్ద తంత్రాన్ని ఎలా అమలు పరిచారు.. అన్న విషయాన్ని చక్కగా చూపించారు. అయితే చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికే హరియాణా ప్రభుత్వం పన్ను మినహాయిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా 128 కోట్లు వ‌సూల్ చేసింది.

 

త‌ర్వ‌లోనే 200 కోట్ల మైలురాయిని దాట‌నున్న‌ది. ప్ర‌స్తుతం సినీ ప్రేక్ష‌కులంతా తానాజీ కోసం ఎగ‌బ‌డుతున్నార‌ని ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.స‌గ‌టును ప్ర‌తి రోజు తానాజీ సినిమా 13 కోట్లు వ‌సూల్ చేసిన‌ట్లు అంచ‌నా వేశారు. ఒక‌వేళ ఇదే రిథ‌మ్‌లో వెళ్తే ఆ సినిమా 200 కోట్లు ఆర్జించిడం ఖాయ‌మే అని ఆద‌ర్శ్ తెలిపారు. ఓమ్ రౌత్ ఈ సినిమాకు డైర‌క్ష‌న్ వ‌హించారు. ఛ‌త్ర‌ప‌తి శివాజీ వ‌ద్ద క‌మాండ‌ర్‌గా ఉన్న తానాజీ జీవిత‌క‌థ ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఉద‌య్‌ భాన్‌ పాత్ర‌లో సైఫ్ అలీ ఖాన్ న‌టించాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: