ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్, ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ కు మూవీ క్రిటిక్ కత్తి మహేష్ మద్దతుగా నిలిచారు. పృథ్వీరాజ్ ఒక మహిళతో మాట్లాడిన ఆడియో రికార్డ్ వైరల్ కావటంతో పృథ్వీ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పృథ్వీరాజ్ అది తన వాయిస్ కాదని మార్ఫింగ్ చేశారని కావాలని ఎవరో తనపై కుట్ర చేశారని వ్యాఖ్యలు చేశారు. కత్తి మహేష్ సోషల్ మీడియా ద్వారా ఈ ఘటన గురించి స్పందించారు. 
 
కత్తి మహేష్ తన ఫేస్ బుక్ ఖాతాలో పృథ్వీరాజ్ వివాదం గురించి వివాదాస్పద పోస్ట్ చేశారు. తన మద్ధతును పృథ్వీరాజ్ కు ప్రకటిస్తూ కొన్ని ప్రశ్నలను పోస్ట్ ద్వారా కత్తి మహేష్ సంధించారు. అది పృథ్వీ గొంతో కాదో అవసరం లేదని ఆ అమ్మాయి కూడా ఇష్టంతోనే మాట్లాడిందని ఆ ఆడియో టేపును వింటే " మ్యూచువల్ కన్సెన్ట్" అనే అర్థం వస్తుందని పోస్ట్ లో తెలిపారు. 
 
ఇద్దరు ఇష్టంతో మాట్లాడుకున్నప్పుడు సమస్య ఏముందని కత్తి మహేష్ ప్రశ్నించారు. టీటీడీలో పని చేసేవారు ప్రేమించుకోకుడదా...? సంసారాలు చేయకూడదా...? అని ప్రశ్నలు సంధించారు. సెక్స్ టాక్, ఛాట్ నిషిద్ధమా..? అని ప్రశ్నించారు.ఈ పోస్టుకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. భారీగా ఈ పోస్టుకు లైకులు, షేర్ లు వస్తున్నాయి. నెటిజెన్లు ఈ పోస్టుపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తోంటే కొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. 
 
మరోవైపు టీటీడీ పృథ్వీ ఆడియో టేపుల విషయంలో విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. పృథ్వీతో ఫోన్ లో మాట్లాడిన సదరు మహిళా ఉద్యోగి ఎవరో తెలియకపోవటంతో విజిలెన్స్ విచారణ ముందుకు సాగటం లేదని తెలుస్తోంది. ఇప్పటికే తన పరువు పోయిందని భావిస్తున్న మహిళ ఫిర్యాదు చేయటానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. తాజా పరిణామాలతో ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉందా...? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: