ఇటీవ‌ల కాలంలో వివాహం.. విడాకులు చాలా కామ‌న్ అయిపోయాయి. వివాహంతో రెండు శ‌రీరాలు మాత్ర‌మే కాదు, రెండు మ‌న‌స్సులు కూడా ఒక్క‌ట‌వుతాయి. దీంతో దంప‌తులిద్ద‌రూ జీవితాంతం అలా ఒకే మ‌న‌స్సులా మారి జీవిస్తారు. ఎలాంటి క‌ష్ట‌, న‌ష్టాలు వ‌చ్చినా, సుఖం, దుఃఖం క‌లిగినా ఇద్ద‌రూ షేర్ చేసుకుంటారు. అలా ఉంటేనే దాన్ని ఆద‌ర్శ దాంప‌త్యం అంటారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో సంవత్సరాల తరబడి ప్రేమించుకొని.. ఒకర్ని ఒకరు బాగా తెలుసుకొని .. ఒకటికి పది సార్లు ఆలోచించుకొని చేసుకున్న పెళ్లిళ్లు కూడా పెటాకులు అవుతున్నాయి. 

 

సవ్యంగా సాగుతున్న కాపురాలు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. సినిమా రంగంలో ఉన్నవాళ్లు ప్రేమించుకోవడం… పెళ్లిళ్లు చేసుకోవడం… ఆ వెంటనే విడాకులు తీసుకోవడం చాలా కామన్‌. బాలీవుడ్‌లో అయితే ఎప్పటి నుంచో ఈ సంస్కృతి ఉంది.  ఎప్పుడు ఏ జంట ఎవరితో రిలేషన్షిప్‌లో ఉంటారు... ఎప్పుడు ఎవరు ? విడిపోతారో చెప్పలేని పరిస్థితి. సంవ‌త్స‌రాల పాటు కాపురం చేసి పిల్లలు పెళ్లి వయసుకు వచ్చాక కూడా అక్కడ స్టార్ హీరో దంప‌తులు విడిపోతున్నారు. అయితే సౌత్‌లో ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఈ సంస్కృతి దూరం. తెలుగులో పెద్ద హీరోల విడాకులు అంటే చాలా అరుదైన విషయమే.

 

కాని, మారుతున్న ట్రెండ్స్‌, సమాజ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు సౌత్ ఇండ‌స్ట్రీలో కూడా సినిమా వాళ్లలో విడాకుల సంస్కృతి ఎక్కువైంది. ఈ నేప‌థ్యంలోనే ఓ పెద్ద హీరో కుమార్తెకు భ‌ర్త‌తో స‌ఖ్య‌త లేదు. ఇండస్ట్రీలో ఆయన పెద్ద హీరో స్టార్ హీరో. ఈయ‌న కుమార్తె చెన్నై నుంచి భ‌ర్త‌ను వ‌దిలేసి వ‌చ్చేసి రెండేళ్లుగా త‌ల్లిదండ్రుల వ‌ద్దే ఉంటోంది. తండ్రి ఎంత చెప్పినా విన‌డం లేదు.  మనస్పర్థలే ఇందుకు కార‌ణమ‌ని టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈమె ఇక్క‌డే ఉండి తండ్రి సినిమాల‌కు ప‌నిచేస్తోంది. అయితే త్వ‌ర‌లోనే విడాకులు తీసుకోవ‌డం ఖాయ‌మ‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: