ఈరోజు మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ నటి షభానా అజ్మీకి తీవ్ర గాయాలయ్యాయి. ముంబాయి - పూణె ఎక్స్ ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షభానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు కోల్హాపూర్ టోల్ ప్లాజా సమీపంలో అదుపు తప్పి ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో షభానా అజ్మీకి తీవ్ర గాయాలయ్యాయి. ఎంజీఎం ఆస్పత్రికి స్థానికులు వెంటనే షభానా అజ్మీని తరలించారు. 
 
షభానా అజ్మీ భర్త జావేద్ అక్తర్ కూడా ప్రమాదం జరిగిన సమయంలో అదే కారులో ప్రయాణిస్తున్నాడు. షభానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పటంతో ట్రక్ వెనుక భాగాన్ని ఢీ కొట్టింది.  షభానా అజ్మీ భర్తకు మాత్రం ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాలేదు. నిన్న రాత్రి షభానా అజ్మీ తన భర్త 75 సంవత్సరాల జన్మదిన వేడుకలను ముంబైలో జరిపారు. కారులో ప్రయాణిస్తున్న మరో మహిళకు, కారు డ్రైవర్ కు కూడా స్వల్పంగా గాయాలయ్యాయని సమాచారం. 
 
ప్రస్తుతం షభానా అజ్మీ పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఐదు జాతీయ చలన చిత్ర పురస్కారాలను అందుకున్న షభానా అజ్మీ ఆర్ట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. షోలే, జంజీర్ లాంటి సినిమాలకు సలీం ఖాన్ తో కలిసి పని చేసిన జావేద్ అక్తర్ ను ఈమె వివాహం చేసుకున్నారు. 
 
ఎన్నో సినిమాలకు మాటలు, పాటలు అందించిన కైఫ్ అజ్మీ షభానా అజ్మీ తండ్రి. హైదరాబాద్ షభానా అజ్మీ స్వస్థలం. షభానా అజ్మీ మేనకోడకు ఫర్హా హీరోయిన్ కాగా ప్రముఖ నటి టబుకి షభానా అజ్మీకి మేనత్త కావడం గమనార్హం. పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పటంతో షభానా అజ్మీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: