అందం అభినయం కలగలిసిన ముద్దుగుమ్మ  పూజా హెగ్డే... నాగ చైతన్య తో ఒక లైలా కోసం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ పూజా హెగ్డే. ఆ తర్వాత వరుస  సినిమాలను చేసుకుంటూ తన టాలెంట్ ఏమిటో నిరూపించుకొని అంచలంచలుగా ఎదిగింది. తన కొంటే చూపుతో  ఎంతోమంది యువకులు మతి పోగొట్టిన ఈ అమ్మడు... తన హాట్ హాట్ అందాలతో సినీ ప్రేక్షకుల్లో హీట్ పెంచి చెమటలు పట్టించింది.తన  అభినయంతో ఎన్నో ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా  కొనసాగుతుంది పూజా హెగ్డే. స్టార్ హీరోలందరి సరసన ఛాన్స్ కొట్టేసి సంచలన విజయాలని  తన ఖాతాలో వేసుకుంది. 

 

 

 ప్రస్తుతం ఈ దర్శక నిర్మాతలు అందరికీ పూజా హెగ్డే కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. దర్శకనిర్మాతలు అందరిచూపు పూజా హెగ్డే వైపే . తమ సినిమాలో పూజ హెగ్డే ని హీరోయిన్ గా నటింపచేయాలనీ  ఎంతో మంది దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. ఇక ఇప్పటికే వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ అమ్మడు.స్టార్  హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి బిజీ బిజీ కెరీర్  గడుపుతోంది. ఇక తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో జోడీ కట్టి...అల  వైకుంఠపురములో  సినిమాలో నటించిన పూజా హెగ్డే మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సినిమాలో ఎంతో క్యూట్ గా కనిపించిన పూజా హెగ్డే ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది.అయితే  గత కొన్ని రెండు రోజుల నుండి పూజా హెగ్డే సంబంధించి టాలీవుడ్ వర్గాల్లో ఓ గాసిప్ నడుస్తోంది. 

 

 

 పూజా హెగ్డే హీరోయిన్ గా ఆంధ్రప్రదేశ్ కు  చెందిన ఓ ఎమ్మెల్యే సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. దీని కోసం పూజ హెగ్డే ని పలుమార్లు సంప్రదించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆ ఎమ్మెల్యే గతంలోనూ పలు సినిమాలకు నిర్మాతగా పనిచేశారు. ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో  పార్టీ మారేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అతని వంశం ఆంధ్ర రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారింది . తాను నిర్మించబోయే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటింప  చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్యే... ఇప్పటికే  పూజా హెగ్డే తో పలుమార్లు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఎమ్మెల్యే సినిమా కోసం పూజ హెగ్డే ఒప్పుకుంటుందా లేదా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: