టాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయింది. టాలీవుడ్ తో పటు పలువురు కోలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ నటులు నటిస్తున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా రాజమౌళి తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. దాదాపుగా రూ.400 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో v v DANAYYA' target='_blank' title='డివివి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లు గా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. 

 

స్వాతంత్రోద్యమానికి ముందు అల్లూరి, భీం ఇద్దరూ కూడా ఒకానొక సమయంలో తమ కుటుంబ సభ్యులను ఎలా కలుసుకున్నారు అనే కల్పిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మొదటగా జులై 30న రిలీజ్ చేస్తాం అని సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే నేడు ఉదయం నుండి జాతీయ స్థాయిలో కొన్ని మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా విడుదల దాదాపుగా వాయిదా పడ్డట్లే అని తెలుస్తోంది. అయితే అందుకు ఒక ముఖ్య కారణం ఉందట. నిజానికి మరికొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తి కానున్న ఈ సినిమాకు సంబంధించి కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ కు అత్యధిక సమయం పడుతోందని, ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాలో లేనన్ని సిజి షాట్స్ ఈ సినిమాలో ఉండనున్నాయట. 

 

అది మాత్రమే కాక సినిమాలో కీలకమైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్స్ కు సంబందించిన సిజి షాట్స్ కు భారీగా సమయం పడుతోందని, అందువల్లనే సినిమాకు సంబంధించిన ఆ వర్క్ పూర్తి అవ్వడానికి ఆగష్టు నెలాఖరు వరకు పడుతుందట. కాగా సెప్టెంబర్ లో సినిమా ప్రమోషన్స్ ప్రారంభిస్తారని, సరిగ్గా అక్టోబర్ లో దసరా సమయానికి సినిమాని థియేటర్స్ లోకి తీసుకువస్తారని అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: