టాలీవుడ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్ మూవీస్ తో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు.  ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించే ప్రతి సినిమాపై ఆడియన్స్ కి భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆ మద్య విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్ లో వచ్చిన ‘డీయర్ కామ్రెడ్’ మూవీ అభిమానులను నిరాశపరిచింది.  తన  కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. మరెవరికీ సాధ్యం కాని విధంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. సినిమా జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడీ యంగ్ హీరో.  తాజాగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వల్లభ నిర్మించిన ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందించాడు. ఆయన బాణీల్లోని 'మై లవ్' అనే పాటను ఫస్టు సింగిల్ గా వదలనున్నారు. ఆ మద్య  ‘డీయర్ కామ్రెడ్’ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ టీజర్ చూసిన వారు.. మరోసారి విజయ్ పూర్తిగా అర్జున్ రెడ్డి తరహా ప్రేమకథతోనే వస్తున్నాడని అర్థమైపోతుంది. రాశీ ఖన్నా వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ టీజర్‌లో చాలా చూపించాడు దర్శకుడు క్రాంతి మాధవ్.  

 

ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్‌, రాశీ ఖన్నా, ఇజబెల్లె లైట్, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నలుగురిని ప్రేమించే వ్యక్తిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకి ఫస్టు సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. మ్యూజిక్ వింటూ నాయకా నాయికలు ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు.  ప్రస్తుతం లిరికల్ సాంగ్స్ సినిమా అంచనాలు పెంచుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: