ఒక్కోసారి జరిగే వింతలు చూస్తే బాబోయ్ అనిపిస్తుంది. ఎందుకంటే సరిగ్గా మార్కెట్ లేని హీరోలకు సైతం భారీగా బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్స్ దొరుకుతారు. అలాగే మంచి టాలెంట్ ఉండి, ఇతనితో సినిమా తీస్తే మినిమం సక్సెస్ వస్తుందనుకున్న హీరోకు మాత్రం బడ్జెట్‌లో కోత విదిస్తారు. ఎవరి ఆలోచనలు వారివే.

 

 

ఇకపోతే  చందు మొండేటి దర్శకుడిగా 2014 లో కార్తికేయ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ సినిమాతో సక్సెస్ సాధించి ఆ తర్వాత 2016 లో ప్రేమమ్.. 2018 లో సవ్యసాచి చిత్రాలకు దర్శకత్వం వహించగా ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక పోయాయి. ఇకపోతే అంతంత మాత్రమే మార్కెట్ ఉన్న నిఖిల్ కార్తికేయ సినిమాతో బోణి కొట్టినా ఆ తర్వాత వచ్చిన చిత్రాలేవి విజయాన్ని సాధించలేక పోయాయి.

 

 

అయితే తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా పట్టాలెక్కడానికి సిద్దం అయ్యింది. అదే ‘కార్తికేయ – 2 ఇకపోతే వచ్చే వారం నుండి ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయబోతున్నారట.  కాగా ఈ సినిమా  రూ.22 కోట్ల బడ్జెట్‌ తో రూపొందించ బడుతుందనేది తాజాగా సినీ వర్గాల సమాచారం. ఇకపోతే ఇందులో వచ్చే కీలకమైన సన్ని వేశాలు కొన్ని విదేశాలలో  చిత్రీకరించాల్సి రావడం, అలాగే సినిమాలో  టాప్ – క్లాస్ విఎఫ్ఎక్స్ వర్క్ చేయాల్సి రావడం కారణంగా  ఈ చిత్రానికి అంత బడ్జెట్ అవుతుందని తెలుస్తోంది.

 

 

ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా,  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  కాగా  ‘కార్తికేయ’ సినిమాతోనే  డైరెక్టర్ గా మంచి డిమాండ్ సంపాదించుకున్న  చందు.. మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’  తీసి… తిరిగి  ఫామ్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడట.. ఇకపోతే  ‘కార్తికేయ’ సినిమాలా, ‘కార్తికేయ 2’ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆశిద్దాం..

మరింత సమాచారం తెలుసుకోండి: