చాలామంది డైరెక్టర్స్ కి స్క్రీన్ మీద కనిపించాలన్న కూతూహలం ఉంటుంది. హీరోగా కాకపోయినా కూడా ఏదో క్యారెక్టర్ లో కాసేపు కనిపించాలన్న తాపత్రయంతో తళుక్కున మెరుస్తుంటారు. వాళ్ళలో అందరికంటే బోయపాటి గుంచి ముందు చెప్పాలి. తన సినిమా మొదలయ్యో ముందు స్టార్ట్ .. కెమరా...యాక్షన్ అంటూ ముందు ఆయనే కనిపిస్తారు. ఇక పూరీ కూడా అప్పుడప్పుడు స్క్రీన్ మీద కనిపించి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తాడు. ఇంతవరకు బాగానే ఉంటుంది. కాని కొంతమందిని చూస్తుంటే వీళ్ళకి స్క్రీన్ పిచ్చి బాగానే ఉందనిపిస్తుంది. ఇది పిచ్చో, ఫ్యాషనో గాని దర్శకుడు v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ సీనయ్యగా మారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు ఇలానే ఒక యంగ్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు.
ఇప్పటికే దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్కూల్ ను ఏర్పాటు చేసుకుంటున్నాడు అనిల్ రావిపూడి. వరసగా వచ్చిన సక్సస్ లు అనిల్ కి మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చాయి. ఇక ఈ యంగ్ డైరెక్టర్ తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' పరిస్థితి ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. అనిల్ రావిపూడి విషయంలో గత సంక్రాంతి సినిమా అంతటి సక్సస్ అయితే ఈ సినిమా విషయంలో కనిపించడం లేదని తెలుస్తోంది. ఎఫ్ 2 ఫార్ములాలోనే సరిలేరులో కొన్ని సీన్లను పెట్టడంతో విమర్శకులు బాగా కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు అనిల్ నెక్స్ట్ సినిమా ఎఫ్ 2 కి సీక్వెల్ లేదా రీమేక్ అని తాజాగా వినిపుస్తున్న వార్త. అయితే మళ్ళీ అదే జానర్ లో సినిమా అయితే మాత్రం ఈ సారి అనిల్ ని ఎవరు పట్టించుకోరని ఇప్పటికే టాక్ మొదలైంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్తగా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అవేమిటంటే అనిల్ రావిపూడి నటుడిగా ఇంకా చెప్పాలంటే హీరోగా ట్రై చేసుకోవచ్చేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. తన సినిమాల్లో ఎండింగ్ టైటిల్ రోల్స్ లో కనిపిస్తూ అనిల్ రావిపూడి ఇప్పటికే తనకున్న స్క్రీన్ పిచ్చిని చూపించుకుంటున్నాడని అంటున్నారు. ఇక సరిలేరు ప్రమోషనల్ వీడియోల్లో అనిల్ రావిపూడి నటనలో తనకున్న స్కిల్స్ ను చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
హీరో మహేశ్ బాబును కూడా సరదాగా అనుకరిస్తూ ఉన్నాడంటేనే మన రావిపూడికి యాక్టింగ్ అంటే ఎంతగా ఆసక్తి ఉందో అర్థమవుతోంది. మరోవైపు ఈ సినిమా హీరోయిన్ రష్మిక అయితే.. ప్రతి సీన్ నూ దర్శకుడు అనిల్ నటించి చూపించాడని చెబుతోంది. హీరోయిన్ ఎలా నటించాలో కూడా అనిల్ రావిపూడే నటించి చూపించాడట! ఇది అందరూ చేసేదె. కానీ అనిల్ మాత్రం ఇంకా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాడట. ఈ మాట రష్మిక చెప్పిన మాట. ఇవన్ని చూసిన నెటిజన్స్ మీరు దర్శకుడిగా కంటే వినాయక్ లా, బోయపాటిలా స్క్రీన్ మీదకి వస్తే బావుంటుందని అంటున్నారట. మరి అనిల్ ఏం చేస్తాడో చూడాలి.