బాహుబలి2 తరువాత అగ్ర దర్శకుడు ఎస్ ఎస్  రాజమౌళి  దర్శకత్వంలో  టాలీవుడ్  బిగెస్ట్ మల్టీస్టారర్ గా  తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈచిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు  యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటి సారి  కలిసి నటిస్తుండగా వారికీ  జోడిగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ , బాలీవుడ్ హీరోయిన్ ఆలియా బట్ కనిపించనున్నారు.  ప్రస్తుతం ఈ చిత్రం  యొక్క షూటింగ్  శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్  కొత్త లుక్ లో కనిపించనున్నాడు. 
 
అందుకోసం ఆయన  ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవన్ దగ్గర ఎప్పటి నుండో శిక్షణ తీసుకుంటుండగా నేటితో ఆ ట్రైనింగ్ పూర్తయిందట అంతేకాదు  తన లుక్ తో మనల్ని  సప్రైజ్ చేయనున్నాడని  లాయిడ్ సోషల్ మీడియా ద్వారావెల్లడించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చారని  సోషల్ మీడియా లో ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది. ముందుగా  అనుకున్నట్లు ఈఏడాది జులై 30న కాకుండా  దసరా కానుకగా  అక్టోబర్ 2 న ఆర్ఆర్ఆర్ విడుదలకానుందట. అయితే ఈ వార్తల పై  అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. 
 
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో స్వాతంత్య్ర సమర యోధులు  అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత  చరిత్రల ఆధారంగా రూపొందుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం గా , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ,తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.  దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రానికి  కీరవాణి సంగీతం అందిస్తుండగా  బుర్రా సాయి మాధవ్  డైలాగ్స్  అందిస్తున్నాడు. దాదాపు 10ప్రముఖ భాషల్లో ఈచిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: