మాటల మాంత్రీకుడి సినిమాలలో నువ్వే నువ్వే, అతడు, ఖలేజా, జల్సా, జులాయి వరకు కథలు ఒకరకంగా ఉండేవి. అంతేకాదు హీరోలని సింపుల్ గా సాధారణంగా చూపించేవారు. కానీ అత్తారింటికి దారేది సినిమా నుండి గురూజీ దారి మారిపోయింది. బాగా రిచ్ నెస్ పెరిగిపోయింది. మధ్యలో వచ్చిన అ..ఆ తప్ప అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అల వైకుంఠపురములో సినిమాలు చూస్తే ప్రతీ సీన్ ని బాగా గ్రాండ్ గా చూపిస్తున్నారు. క్లాసీ నెస్ బాగా ఎక్కువైపోయింది. త‌న సినిమాల‌ను చాలా రిచ్ బ్యాక్ గ్రౌండ్స్ లో తీయ‌డానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు మన త్రివిక్రముడు.  మ‌ధ్య‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి క‌ష్టాల‌నూ ప్ర‌స్తావిస్తున్నప్పటికి.. త్రివిక్ర‌మ్ సినిమాల్లో చాలా క్యారెక్ట‌ర్లు ఆల్ట్రా మోడ్రన్ రేంజ్ లో బాగా రిచ్ గా ఉంటున్నాయి. హీరో లేదా హీరోయినో.. కొన్ని సినిమాల్లో ప్ర‌ధాన పాత్ర‌ల‌న్నీ అత్యంత ఖ‌రీదైన జీవ‌న శైలితోనే క‌నిపిస్తాయి. దానికి అల వైకుంఠ‌పురం కూడా తక్కువేం కాదని అర్థమైపోయింది.

 

అత్తారింటికి దారేదీ, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, అ..ఆ..ఇలాంటి సినిమాల్లో హీరోకో, హీరోయిన్ కో చాలా ఖ‌రీదైన సెట‌ప్ క‌నిపిస్తుంది. అత్తారింటికీ దారేదీ అయితే మ‌రింత హై రేంజ్! అలా కోటీశ్వ‌రుల క‌థ‌ల‌ను కోట్ల రూపాయ‌లు పెట్టి తెర‌కెక్కిస్తున్న త్రివిక్ర‌మ్ అల వైకుంఠ‌పురంలో సినిమా విష‌యంలో మ‌రింత రిచ్ నెస్ కోసం చాలా ప్ర‌య‌త్నాలే చేసినట్టు మళ్ళీ ప్రూవ్ అయింది. బన్నీ మీదో లేక కథ మీదో లేక త్రివిక్ర‌మ్ రెగ్యులర్ గా వాడే పంచ్ ల మీదా, ప్రాసల మీదా దృష్ఠి పెట్టకుండా గమనిస్తే అల లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అవే ఫారెన్ మోడ‌ల్స్, ఫారెన్ ఫైట‌ర్స్ తో తెరను నింపేయ‌డం. అల వైకుంఠ‌పురంలో సినిమాలో పాట‌ల‌ను, సీన్ల‌ను ఫారెన్ లొకేష‌న్లలో తీశారు. వాటిల్లో ఫారెన‌ర్స్ క‌నిపిస్తే వింత ఏముండదు గాని.. ఇండియా సీన్ల‌లో, ఇంట్లో సీన్ల‌లో కూడా త్రివిక్ర‌మ్ ఫారెన‌ర్స్ ను చూపించారు. ఇది కాస్త విడ్డూరంగా అనిపిస్తుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

 

ఇక బ్ర‌హ్మాజీ వెంట ఉండే రౌడీలు కూడా ఫారెనర్సే ఉండటం మరీ వింత అంటున్నారు ప్రేక్షకులు! ఇంట్లో పార్టీ పాట‌లో డ్యాన్సులేసే అమ్మాయిలూ ఫారెన‌ర్సే! పాట‌ల్లో అమ్మాయ‌ల‌ను, ఫైట్ల‌లో ఫైట‌ర్ల‌ను కూడా తెల్ల‌తోలు ఉన్న వాళ్ల‌నే చూపించారు మన మాటల మాంత్రీకుడు. ఇలా ఇండియాలో సాగే సినిమాలో రౌడీ బ్యాచ్ ను కూడా ఫారెనర్స్ గా  చూపి త్రివిక్ర‌మ్ రిచ్ నెస్ ను చూపించారు తప్ప చెప్పుకోవడానికి మాత్రం గొప్ప కథ ని చూపించలేకపోయారన్న టాక్ నడుస్తోంది. అయితే ఇదంతా ప్రేక్షకుడి దృష్ఠిని మార్చడానికే అన్న మరో మాట వినిపిస్తోంది. అంతేకాదు అతడు, జల్సా, జులాయి కూడా సాధారణ కథలే కదా మరి ఆ సినిమాలలో ఎందుకు ఇలాంటి బ్యాచ్ ని సీన్స్ ని పెట్టలేదని కంపేర్ కూడా చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: