టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తో పాటు కలెక్షన్స్ తో కూడా దూసుకుపోతోంది. మొన్న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలుత మిశ్రమ స్పందన లభించింది. అయితే సంక్రాంతి సీజన్ కావడంతో పాటు, సూపర్ స్టార్ మహేష్ చాలా గ్యాప్ తరువాత మంచి ఎంటర్టైనింగ్ రోల్ లో నటించడంతో సినిమాకు కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వచ్చిన ఈ సినిమాను మంచి కమర్షియల్, మాస్, యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కించడం జరిగింది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమలో లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించారు. 

 

ఇకపోతే ఈ సినిమాతో పాటు సరిగ్గా ఒక్క రోజు తరువాత ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అలవైకుంఠపురములో. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో వచ్చిన ఈ సినిమా కూడా మంచి సక్సెస్ టాక్ ని సంపాదించి, బాగానే కలెక్షన్స్ సంపాదిస్తూ దూసుకెళ్తోంది. నిజానికి గొప్ప కథ, కథనాలు ఈ సినిమాలో లేనప్పటికీ, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాని తీయడంతో ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఇక మొన్న సరిలేరు సినిమా మొదటి వారంలో రూ.100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిందంటూ ఆ సినిమా యూనిట్ ఒక ప్రకటన రిలీజ్ చేయగా, నేడు అలవైకుంఠపురములో సినిమా యూనిట్ తమ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే రూ.104 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టినట్లు ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఇప్పుడు ఇదే, ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య విపరీతమైన వివాదానికి కారణభూతమైంది. 

 

ఓవైపు మహేష్ సినిమా రికార్డ్స్ ఫేక్ అంటూ బన్నీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటే, లేదు బన్నీ సినిమా రికార్డులే పక్కా ఫేక్ అంటూ మహేష్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక నిన్న రాత్రి నుండి ట్విట్టర్ వేదికగా ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పై కొందరు విశ్లేషకులు ఏమంటున్నారంటే, ప్రస్తుతం సంక్రాంతి కనుకగా రిలీజ్ అయిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకాదరణతో ముందుకు సాగుతున్నాయని, అయితే కలెక్షన్స్ విషయమై ఫేక్ అంటూ ఒకరిపై మరొకరు ఈ విధంగా వాగ్వివాదం పెట్టుకోవడం తగదని, అతి త్వరలోనే రెండు సినిమాల పూర్తి కలెక్షన్స్ పై రెండు సినిమాల నిర్మాతలు క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ రెండు సినిమాల నిర్మాతలు ఈ విషయమై ఎంతవరకు జోక్యం చేసుకుంటారో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: