బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ..ఇలా సౌత్ .. నార్త్ ఎక్కడైనా కొంతమంది ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలుగుతున్న వాళ్ళు గతం గుర్తు చేసుకోవడం చాలా కామన్. ఎందుకంటే చాలా తక్కువ మందే గతం గతహా అనుకుంటారు గాని కొంతమంది మాత్రం ఆ గతం తలుచుకొని కొన్ని సందర్భాలలో బాధపడుతుంటారు. అవి గుణపాఠాలు అని వాళ్ళకి వాళ్ళే సర్ధి చెప్పుకుంటారు. ముఖ్యంగా కెరీర్ ఆరంభంలో మహా నాటుగా ఘాటుగా నటించిన చాలామంది స్టార్ డం వచ్చాక ఆ క్యారెక్టర్స్ ని మర్చిపోతారు. కానీ ఏదో ఒక సందర్భంలో ఏవో కామెంట్స్ చేసి నెటిజన్స్ తో విమర్శలు ఎదుర్కుంటుంటారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తను నటన మొదలుపెట్టిన రోజుల గురించి చెబుతూ గతం గుర్తు చేసుకుంది ప్రియాంక చోప్రా.

 

మిస్ వరల్డ్ గా నిలిచిన తర్వాత ప్రియాంక బాలీవుడ్ సినిమాల వైపు వచ్చిన సంగతి తెలిసిందే. ఇరవై యేళ్ల కిందట మిస్ వరల్డ్ గా నిలిచింది ప్రియాంక. ఆ తర్వాత తక్కువ కాలంలోనే బాలీవుడ్ లో తన సత్తా ఏంటో నిరూపించుకుంది. అన్నీ రకాల జోనర్స్ లో తెరకెక్కిన సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారింది. కెరీర్ తొలి నాళ్లలోనే అటు గ్లామరస్ మరోవైపు నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా ప్రియాంక వెనుకాడలేదు. అయితే అలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు ప్రియాంక కి బాగా కలిసి వచ్చాయి.

 

ముఖ్యంగా ఐత్ రాజ్ సినిమాలో వేరే ఆవిడ భర్తను కామంతో ఆకట్టుకునే పాత్రను చేసింది ప్రియాంక. అలాంటి పాత్రలు చేయవద్దని తనకు కొంతమంది సూచించినట్టుగా ప్రియాంక చెప్పింది. అలాంటి పాత్రలు చేస్తే అదే ఇమేజ్ తనకు వస్తుందని తన సన్నిహితవర్గాలు భయపెట్టారని ప్రియాంక చెప్పింది. అయినా తను భయపడకుండా అలాంటి సినిమాల్లో నటించినట్టుగా ప్రియాంక తెలిపింది. ఐత్ రాజ్ సినిమా ప్రియాంక కు మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది. ఆ సినిమా హిట్ అవడమే కాదు ప్రియాంక పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

ఇక ఆ తర్వాత నుంచి ప్రియాంక కెరీర్ బాగా ఊపందుకుంది. అలాగే తను సినిమా కెరీర్ మొదలుపెట్టిన రోజుల్లో హీరోలే తమ సినిమాల్లో హీరోయిన్ గా ఎవరుండాలో డిసైడ్ చేసే పరిస్థితి ఉండేదని ప్రియాంక వెల్లడించింది. అప్పట్లో హీరో కోరుకున్న హీరోయినే తమ సినిమాల్లో ఉండేదని ఫీలయింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నట్టుగా ప్రియాంక అభిప్రాయ పడుతోంది. అయితే నిజంగానే ఆ పరిస్థితి మారిందా? అంటే.. కచ్చితంగా అని మాత్రం ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ హీరోయిన్స్ బాగా రికమెండ్ చేస్తారన్న మాట అందరికి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: