టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతూ మంచి జోష్ మీదున్నారు. రెండేళ్ల క్రితం భరత్ అనే నేను, అలానే గత ఏడాది మహర్షి, ఇక ఈ ఏడాది ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాలతో విజయాలు అందుకున్న సూపర్ స్టార్, కెరీర్ పరంగా హ్యాట్రిక్ సూపర్ హిట్స్ దక్కడంతో మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సరిలేరు సినిమాని మరింతగా ప్రమోట్ చేస్తూ అవకాశం ఉన్నంతవరకు సినిమాని తనవంతుగా ముందుకు తీసుకెళ్తున్న మహేష్ బాబు, 

 

తనకు మంచి సక్సెస్ఫుల్ సినిమాలు అందించిన దర్శకులకు మాత్రం ఎప్పుడూ మరొక అవకాశం ఇస్తుంటారు. ఆ విధంగా గతంలో గుణశేఖర్ తో ఒక్కడు, అర్జున్, సైనికుడు సినిమాలు చేసిన మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అతడు, ఖలేజా సినిమాలు అలానే, శ్రీకాంత్ అడ్డాలతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, పూరి జగన్నాథ్ తో పోకిరి, బిజినెస్ మ్యాన్, ఇక శ్రీను వైట్లతో దూకుడు, ఆగడు సినిమాలు, కొన్నాళ్ల క్రితం కొరటాల శివతో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు చేయడం జరిగింది. ఇకపోతే గత ఏడాది తనకు మహర్షి వంటి సూపర్ డూపర్ హిట్ ని అందించిన వంశీ పైడిపల్లి తో అతి త్వరలో మరొక సినిమా చేయబోతున్న సూపర్ స్టార్, దాని తరువాత మరొక్కసారి సరిలేరు దర్శకుడు అనిల్ రావిపూడితో కూడా మరో సినిమా చేయనున్నట్లు టాలీవుడ్ టాక్. 

 

ఇక మహర్షి సినిమా రిలీజ్ తరువాత నుండి దర్శకుడు వంశీతో కలిసి ప్రతి ఒక్క వేడుకకు మహేష్ హాజరవుతూనే ఉన్నారు, ఇక ఇటీవల సరిలేరు ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గరి నుండి, మొన్నటి సక్సెస్ మీట్స్ వరకు కూడా అన్ని ఫంక్షన్స్ కు వంశీ హాజరు కావడం జరిగింది. అయితే ప్రతి చోటా కూడా మహేష్ ప్రక్కనే వంశీ కూడా కనపడడం గమనిస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఒకింత సరదాగా ఆయన పై సోషల్ మీడియా మాధ్యమాల్లో కోకోకోకో కోడి, మా బాబుని వదలవా పైడి అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పటికే మహేష్ కు మహర్షి వంటి సక్సెస్ ఇచ్చిన వంశీ, తదుపరి ఎటువంటి సినిమా ఇవ్వనున్నాడో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: