టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన ‘రంగస్థలం’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత సుకుమార్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ప్రకటించడం జరిగింది. అయితే ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా క్యాన్సిల్ చేసుకున్న సుకుమార్ తర్వాత వెంటనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఈ సినిమాని ఓకే చేయించుకోవడం జరిగింది. అయితే తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇప్పుడు తాజాగా సుకుమార్ తో చేయబోయే సినిమా మెగా అభిమానుల లో ఫుల్లు అంచనాలు నెలకొన్నాయి.

 

అయితే 'అల వైకుంఠపురములో' సినిమా భయంకరంగా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఫుల్ టెన్షన్ లో సుకుమార్ అన్నట్లు ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్. ముఖ్యంగా సినిమా మాస్ తరహా లో అల్లు అర్జున్ తో చేయబోయే సబ్జెక్ట్ ఉండటంతో సుకుమార్ టెన్షన్ లో ఉన్నట్టు గతంలో 'అల వైకుంఠపురములో' సినిమా రాకముందు అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య‌’ ఫుల్ మాస్ తరహా సబ్జెక్ట్ కావడంతో అది బన్నీ కెరీర్లో భయంకర డిజాస్టర్ సినిమాగా మిగిలి పోవటంతో సుకుమార్ టెన్షన్లో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో వినపడుతున్న టాక్.

 

ప్రస్తుతం బన్నీ తో చేయబోయే సినిమా ఫుల్ మాస్ శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లర్ తరహాలో సినిమా ఉండబోతున్నట్లు సినిమాలో బన్నీ గెటప్ కూడా లుంగీ మరియు కాస్త ఎక్కువ గుబురు గడ్డంతో బన్నీ క్యారెక్టర్ ఉండబోతున్నట్లు దీంతో బన్నీ సినిమా ఫుల్ మాస్ తరహా లో ఉండటంతో ‘నా పేరు సూర్య…’ సినిమా రిజల్ట్ రిపీట్ అవుతుందేమో అన్న టెన్షన్ లో సుకుమార్ ఉన్నట్లు ఫిలింనగర్ లో వినపడుతున్న టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: