బూతు సినిమాల చిత్ర దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన మారుతి ‘భలేభలే మగాడివోయ్’ మూవీతో తన బూతు ఇమేజ్ ని తుడిచివేసుకుని ఫ్యామిలీ సినిమాల దర్శకుడుగా మారిపోయాడు. ‘శైలజా రెడ్డి’ మూవీ షాక్ ఇచ్చినా లేటెస్ట్ గా విడుదలైన ‘ప్రతిరోజు పండగే’ ఊహించని ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు మిడిల్ రేంజ్ హీరోల దృష్టి అంతా మారుతి పై ఉంది. 

అయితే మారుతి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించి తాను కూడ స్టార్ డైరెక్టర్ గా మారాలని తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈప్రయత్నాలలో భాగంగా గతంలో తనకు మహేష్ అల్లు అర్జున్ లు ఇచ్చిన మాటను గుర్తుకు చేస్తున్నాడు. 

   
మారుతికి హిట్ డైరెక్టర్ గా గుర్తింపు కలిగించిన ‘ప్రేమ కథ చిత్రం’ మూవీని చూసి మహేష్ తనకు తానుగా మారుతికి ఫోన్ చేసి ఒకమంచి కథ ఉంటే తనను కలవమని అతడితో సినిమాను చేసే విషయం ఆలోచిస్తాను అని చెప్పాడట. అయితే మహేష్ బాబును ఒప్పించే కథ తన వద్ద లేకపోవడంతో అప్పట్లో మహేష్ తో సినిమాను తీయడానికి మారుతి ప్రయత్నించ లేదట. అదేవిధంగా అల్లు అర్జున్ కు ఖాళీ దొరికినప్పుడల్లా మారుతిని తనవద్దకు మారుతిని పిలిపించుకుని తనకు సరిపడే కథ ఏదైనా ఉందా అని అడగడమే కాకుండా కొన్ని కథలను కూడ బన్నీ విన్నాడట. 

అంతేకాదు సాయి తేజ్ తో తీసిన ‘ప్రతిరోజు పండగే’ మూవీ సూపర్ సక్సస్ అయితే తాను మారుతికి అవకాశం ఇస్తాను అంటూ మాట కూడ ఇచ్చాడట.  ‘ప్రతి రోజు పండగే’ మూవీ సూపర్ సక్సస్ అవ్వడమే కాకుండా ఆమూవీలో 30మంది పెద్ద ఆర్టిస్టులను మేనేజ్ చేయడంతో మారుతికి పెద్ద హీరోలను కూడ డైరెక్ట్ చేయగలను అన్న నమ్మకం ఏర్పడి ఇప్పుడు మహేష్ అల్లు అర్జున్ లు తనకు గతంలో ఇచ్చిన ప్రామిస్ లను గుర్తుకు చేస్తున్నాడు. ‘అల’ సినిమా తరువాత బన్నీ సుకుమార్ తో సినిమా చేస్తూ ‘సరిలేరు’ తరువాత మహేష్ వంశీ పైడిపల్లి తో సినిమాలు చేస్తున్న పరిస్థితులలో మారుతి వీరిద్దరికీ గతంలో చెప్పిన మాటలు గుర్తుకు చేస్తున్నా ఇప్పడు వారిద్దరు స్పందిస్తారా అన్నదే చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: