‘బాహుబలి’ మూవీ జాతీయ స్థాయిలో ముఖ్యంగా బాలీవుడ్ లో  సాధించిన కలెక్షన్స్ రికార్డులకు ఆ మూవీని బాలీవుడ్ లో విడుదల చేసిన కరణ్ జోహార్ ప్రమోషన్ వ్యూహాలు ఎంతగానో సహకరించింది అన్నది ఓపెన్ సీక్రెట్. ‘బాహుబలి’ తరువాత రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ను కూడ బాలీవుడ్ లో విడుదల చేయాలని కరణ్ జోహార్ చాల గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.

అయితే ఈసారి రాజమౌళి మాత్రం బాలీవుడ్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ ను కరణ్ జోహార్ ద్వారా కాకుండా మరొక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ద్వారా విడుడుదల చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనితో రాజమౌళి కరణ్ జోహార్ల మధ్య చిన్న గ్యాప్ ఏర్పడింది అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు కూడ వ్రాసింది.  

ఇలాంటి పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ పేరు చెప్పకుండా ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చేసిన ట్విట్ వెనుక కరణ్ జోహార్ హస్తం ఉందా అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. "ఎక్స్ క్లూజివ్ - ఈ పెద్ద సినిమా ఏంటో గెస్ చేయండి. సౌతిండియాకు చెందిన బ్లాక్ బస్టర్ డైరక్టర్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇప్పుడీ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ బడా మూవీ అక్టోబర్ 2020న రాబోతోంది."

దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి బాలీవుడ్ బయ్యర్ల దగ్గర నుండి వస్తున్న భారీ ఆఫర్లను దెబ్బ తీసే విధంగా ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు అని పరోక్షంగా చెప్పే వ్యూహాలలో భాగంగా ఈ ట్విట్ తరణ్ ఆదర్శ్ చేసి ఉంటాడు అంటూ మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. ఇది ఇలా కొనసాగుతూ ఉంటే తన సరసన నటించాల్సిన అలియాభట్ ఇంకా సెట్స్ పైకి రాలేదంటూ రామ్ చరణ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ను బట్టి అసలు ‘ఆర్ ఆర్ ఆర్’ లో ఏమిజరుగుతోంది అంటూ గాసిప్పులు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: