స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా  ఫ్లాప్ తర్వాత కూడా బాగా ఊపందుకున్నాడు. సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే.. అనే సామెతని గుర్తు చేసేలా 'అల వైకుంఠపురములో' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీని సృష్ఠిస్తున్నాడు బన్నీ. ఇలాంటి క్లాస్ సినిమా మాస్ సెంటర్లలో కూడా అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఒకేసారి టాప్ ఫామ్ అందుకున్న బన్నీ.. తర్వాత మాంచి మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి.. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరగడం ఖాయం. ఇది అల తో నిరూపించాడు. నిజంగా ఈ సక్సస్ ఎవరూ ఊహించనిది. మహేష్ బాబు, రజనీకాంత్ లాంటి వాళ్ళున్నప్పటికి ఏమాత్రం వాళ్ళ మ్యానియా పనిచేయలేదు. వాళ్ళ సినిమాలతో పోటీకి దిగిన బన్ని ఆ రెండు సినిమాకి పైచేయిగా సక్సస్ అందుకున్నాడు. 

 

ఇక సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేయబోయే కొత్త సినిమాకు హిట్ టాక్ పడాలే కానీ.. ఆ రేంజే వేరుగా ఉంటుంది. సుకుమార్ 'రంగస్థలం' లాంటి మెగా హిట్ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి అంచనాలు బాగా ఉన్నాయి. బన్నీ 'అల వైకుంఠపురములో' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాడంటే బన్నీ మీద కూడా బాగా ఒత్తిడి ఉండటం సహజం. ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో గాని ఇండస్ట్రీ వర్గాల్లో గాని అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ తన కెరీర్లో మరే సినిమాకూ లేని స్థాయిలో ఈ సినిమాకోసం కోసం కష్టపడ్డాడు. ఏడాదిన్నరకు పైగా స్క్రిప్టు మీద పని చేశాడు. ఈ సినిమా రైటింగ్ టీం సమాచారం ప్రకారం స్క్రిప్టు సూపర్బ్ అనిపించేలా సుక్కు తీర్చి దిద్దారని సమాచారం. 'రంగస్థలం' తరహాలోనే ఈ సినిమా కూడా పీరియడిక్ ఫిలిమేనని అంటున్నారు. 

 

ఆ సినిమాలాగే బన్నీ సుక్కూ సినిమా కూడా విలేజ్ బ్యాక్డ్రాప్లో ‘రా’గా సాగుతుందట. ఇందులో హీరో ఎలివేషన్లు యాక్షన్ ఘట్టాలు ఓ రేంజ్ లో ఉంటాయని ఇప్పటికే చెప్పుకుంటున్నారు. సినిమా కొత్తగా ఉంటూనే.. మాస్ ని కూడా విపరీతంగా మెప్పించేలా ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండి రంగస్థలం సినిమా లాగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం బన్నీ బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయమని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. అతియే బన్నీ ఫ్యాన్స్ మాత్రం నిజంగా ఈ సినిమా గనక బ్లాక్ బస్టర్ అయితే బన్నీ మరో పవర్ స్టార్ ఇమేజ్ ని దక్కించుకోవడం పక్కా అని చెప్పుకుంటున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని చిత్ర యూనిట్ ద్వారా అందిన సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: