సంక్రాంతి సినిమాల హడావిడి ముగిసిపోవడంతో ఇక నెమ్మదిగా ప్రతి శుక్రువారం సందడి చేయబోయే సినిమాల ప్రమోషన్ ప్రారంభం అయింది. ఈ వారం రిపబ్లిక్ డే ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ‘డిస్కో రాజా’ మూవీ విజయం మాస్ మహారాజ కెరియర్ కు చాల అవసరం. 

వరస ఫ్లాప్ లతో సతమతమవుతున్న రవితేజాకు ఈ మూవీ కూడ సక్సస్ అవ్వకపోతే అతడి మార్కెట్ పూర్తిగా పడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో తన మూవీని ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను రవితేజ చాల వరకు షేర్ చేసాడు. 

తనకు దేవుడు పై నమ్మకం లేదు అంటూ తాను నాస్థికుడుని అన్న విషయాన్ని బయటపెట్టాడు. తాను ఇప్పటి వరకు గుడికి వెళ్ళలేదనీ పూజలు చేయలేదనీ వాస్తు జాతకాల పై నమ్మకం లేదని చెపుతూ బుద్ధి సరిగ్గా ఉంటే అదే నిజమైన దేవుడు అంటూ కామెంట్స్ చేసాడు. అయితే తన తల్లి మాత్రం వ్రతాలు పూజలు బాగా చేస్తుందని జోక్ చేసాడు. 

ఇదే సందర్భంలో తన పిల్లల గురించి మాట్లాడుతూ వారికి కష్టం విలువ తెలియాలి అని ఇప్పటి వరకు తన పిల్లలను తనకు నాలుగు కార్లు ఉన్నా వాటిలో తాను ఎప్పుడు తన పిల్లలను స్కూల్ కు పంపలేదనీ వారిని స్కూల్ బస్సులలోనే పంపుతున్న విషయాన్ని బయటపెట్టాడు. సినిమాల పై తనకు చిన్నతనంలో ఉన్న పిచ్చితో ఒకేరోజు తాను మూడు సినిమాలను చూసిన సందర్భాలు కూడ ఉన్నాయని చెపుతూ ఒక సినిమా హిట్ అయితే అది అంతా హీరో వల్లనే జరిగిందని బుజాలు ఎగరవేసుకోవడం తనకు నచ్చదు అంటూ ఎంతటి గొప్ప వ్యక్తికైనా సక్సస్ ఫెయిల్యూర్ లు సమానంగా పలకరిస్తాయని చెపుతూ తాను జీవితంలో ప్రతి విషయాన్ని లైట్ గా తీసుకుంటాను కాని సీరియస్ గా తీసుకొను అంటూ తన మనస్తత్వాన్ని బయట పెట్టాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: