అల.. వైకుంఠపురములో సినిమాతో అద్భుతమైన ఫామ్ లోకి వచ్చాడు అల్లు అర్జున్. పదిహేనేళ్ల బన్నీ కెరీర్ లో చేసిన 19 సినిమాల్లో హిట్లు, సూపర్ హిట్లు బాగానే ఉన్నాయి. స్టార్ డమ్ కూడా ఉంది. కానీ యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం లేదనే చెప్పాలి. అల.. వైకుంఠపురములో సినిమాతో బన్నీ ఆ లోటును భర్తీ చేసుకున్నాడు. మొదటి షోతోనే ఈ సినిమాకు వచ్చిన బ్లాక్ బస్టర్ టాక్ తో వారం రోజుల నుంచీ ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 2020 సంక్రాంతి విన్నర్ గా అనేక ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కూడా సాధించి పంపిణీదారులను లాభాల బాట పట్టించింది.

 

 

సినిమా విజయానందంలో ఉన్న బన్నీ తన తదుపరి సినిమా షూటింగ్ లో ఫిబ్రవరి నుంచి పాల్గొంటున్నాడు. టెక్నికల్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అల.. రిలీజ్ అవ్వక ముందునుంచే భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు అల.. బ్లాక్ బస్టర్ హిట్ దీనికి తోడై సుకుమార్బన్నీ కాంబో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రెండేళ్లవుతున్నా తగ్గని రంగస్థలం ఇండస్ట్రీ హిట్ ఫ్లేవర్ తో సుకుమార్, ప్రెజంట్ బ్లాక్ బస్టర్ అల.. తో బన్నీ ఇద్దరూ తిరుగులేని ఫాంలో ఉన్నారు. ఇప్పటికే బయటకొచ్చిన టాక్ ను బట్టి ఈ సినిమా ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

 

 

క్లాస్ సినిమా తర్వాత బన్నీ చేస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ సినిమా అంటున్నారు. సాఫ్ట్ కంటెంట్ ఉన్న అల.. సినిమాకు బన్నీ తన క్రేజ్ తో మాస్ ఆడియన్స్ ను కూడా మెప్పించి ధియేటర్లకు రప్పిస్తున్నాడు. ఇప్పుడు మాస్ హిట్ కొడితే సంచలనమే అవుతుంది. శేషాచలం అనే టైటిల్ అనుకుంటున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: