అతనొక టాలీవుడ్ స్టార్ హీరో. ఈ మధ్యే విడుదలైన ఆ హీరో సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని రికార్డు స్థాయి కలెక్షన్లను అందుకుంటోంది. ఈ టాలీవుడ్ హీరో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో భూములు కొన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో నివశించే ఆ స్టార్ హీరో వరంగల్ లో భూములు ఎందుకు కొన్నారనే ప్రశ్నకు ఒక పార్టీకి దగ్గరవ్వాలనే ఆలోచనతోనే పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. 
 
ఈ మధ్యే వరంగల్ లో జరిగిన ఈ హీరో సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కు తెలంగాణకు చెందిన ఒక ముఖ్యనేత హాజరయ్యారు. ఈ టాలీవుడ్ స్టార్ హీరో మున్సిపల్ ఎన్నికల్లో కూడా పెట్టుబడులు పెట్టాడని ఆ ముఖ్యనేతకు మున్సిపల్ ఎన్నికల్లో సహాయం చేశాడని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. వరుస సక్సెస్ లతో జోరు మీదున్న స్టార్ హీరో ప్రత్యక్షంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా పరోక్షంగా మాత్రం రాజకీయ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. 
 
గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో భూములు కొనటంతో పాటు ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న స్టార్ హీరో తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ నేత సూచనలతోనే గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ స్టార్ హీరో తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రముఖ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంతుందో అనే విషయం తెలియాల్సి ఉంది. 
 
వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో విజయాలు అందుకుంటున్న ఆ స్టార్ హీరో తరువాత సినిమా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ హీరో త్వరలో అధికారికంగా కొత్త సినిమా వివరాలను ప్రకటిస్తాడని సమాచారం. కొన్ని సంవత్సరాల క్రితం కొంతకాలం ఫ్లాపులతో సతమతమైన ఈ హీరో ఇప్పుడు మాత్రం కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తూ హ్యాట్రిక్ హిట్లను సొంతం చేసుకోవడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: