గత ఏడాది  ఎఫ్ 2 అలాగే  గద్దల కొండ గణేష్ తో  బ్యాక్ టు బ్యాక్  హిట్లు కొట్టి  మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు మెగా హీరో వరుణ్ తేజ్.  అందులో  మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఎఫ్  2 అయితే బాక్సాఫీస్ వద్ద  80కోట్ల వసూళ్లను రాబట్టి  వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగెస్ట్ బ్లాక్ బాస్టర్ గా  నిలిచింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ మరో హీరోగా నటించాడు.  
 
ఈచిత్రం తరువాత వరుణ్  ఇటీవల  గద్దల కొండ గణేష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.  ఈ చిత్రం తో మొదటి సారి ఊర మాస్ పాత్రలో నటించి వరుణ్ తేజ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ చిత్రం తరువాత  వరుణ్ తేజ్ 10వ చిత్రాన్ని స్పోర్ట్స్  బ్యాక్ డ్రాప్ లో చేయనున్నాడు. బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి  బాక్సర్ అనే టైటిల్ ఖరారు చేశారు.  ఇటీవలే  ఈ చిత్రం లాంచ్ అయ్యింది. ప్రస్తుతం  ప్రీ ప్రొడక్షన్ దశలో వున్న ఈ చిత్రం  అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రం లో కూడా వరుణ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.
 
 
ఈరోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా  బాక్సర్ నుండి  ఆయన ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు. ఈ పోస్టర్ లో వరుణ్, గ్లోవ్స్ ధరించి సీరియస్ గా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా కనిపించాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి  తెరకెక్కించనున్న ఈ సినిమా ను ప్రముఖ నిర్మాత  అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ  నిర్మించనున్నాడు. తమన్ సంగీతం అందించనున్నాడు. ఈఏడాది ద్వితీయార్థం లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: