ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం రియలిస్టిక్ కథల వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతుంది. ఒకప్పుడైతే ఎక్కువగా సినిమా హంగులు అద్ది తేనె సినిమా హిట్ అయ్యేది కానీ ఇప్పుడు మాత్రం సినిమాలో ఎంత సహజత్వం ఉంటే అంత మంచి హిట్ సాధిస్తుంది సినిమా. దీంతో దర్శక నిర్మాతలు అందరూ రియలిస్టిక్ సినిమాలు తీయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఎన్నో హంగు ఆర్భాటాలు చేయకుండా... సహజత్వానికి దగ్గరగా రియలిస్టిక్ కథాంశంతో సినిమాలను తెరకెక్కించి భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కువగా ఇలాంటి సినిమాలు మన తెలుగు చిత్ర పరిశ్రమలు వస్తున్నాయి. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు అందరూ రియలిస్టిక్ కథల వైపు మొగ్గు చూపుతున్నారు. 

 

 

 ఏకంగా స్టార్ హీరో రామ్ చరణ్ సైతం రంగస్థలం లాంటి సినిమాతో రియలిస్టిక్ కథాంశం ఉన్న సినిమా వైపు నడిచి తనలోని అసలు సిసలైన నటుణ్ని  ప్రేక్షకులందరికీ పరిచయం చేశారు. ఇక తాజాగా ఇలాంటి రియలిస్టిక్  కథాంశంతో వస్తున్నా చిత్రమే మిస్టర్ అండ్ మిస్. ప్రస్తుతం యువత మొత్తం పాశ్చాత్య పోకడలు పోయి  డేటింగ్ చాటింగ్ కు అలవాటు పడి పెడదారి పడుతున్న యువతను మేల్కొలిపే కథాంశంతో ఈ సినిమ తెరకెక్కుతుంది. ఈ జనరేషన్లో యువత ప్రేమ కథ ఎలా ఉంది అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. క్రౌడ్ ఫండింగ్ సినిమాగా  వస్తున్న ఈ సినిమాను నిర్మాత ashok REDDY' target='_blank' title='అశోక్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. 

 

 

 ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు ashok REDDY' target='_blank' title='అశోక్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అశోక్ రెడ్డి ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మిస్టర్ అండ్ మిస్ సినిమా కథ ఈ తరం ప్రేమ కథ అంటూ ఆయన తెలిపారు. ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు.. ముంబైకి చెందిన మోడరన్ యువతి లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటారు. ఈ జంటలో ఒకరి  మొబైల్ మిస్ అవుతుంది. ఆ మొబైల్ లో ఏముంది ఆ మొబైల్ పోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మిస్టర్ అండ్ మిస్ కథ అని దర్శకుడు తెలిపారు. యూత్ రిలేటెడ్ కంటెంట్ తో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో జ్ఞానేశ్వరి కాండ్రేగుల, శైలేష్ సన్నీ జంటగా నటించారు ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణానంతర పనులు బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: