మహేష్ బాబు పుణ్యమా అని డిజాస్టర్ దర్శకుడు రమేష్ మెహర్ సుడి తిరిగిపోయందంటున్నారు. వరుస డిజాస్టర్ సినిమాలతో ఫేడవుట్ అయిపోయిన ఈ డైరెక్టర్ లక్ గురించి ఇపుడు ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. కొంపతీసి ప్రిన్స్ ఈ దర్శకుడికి సినిమా ఛాన్స్ ఇచ్చాడా అని ఫ్యాన్స్ కంగారు పడిపోకండి. ఛాన్స్ ఇవ్వకుండానే ప్రిన్స్ ఈ దర్శకుడికి సక్సెస్ ఇచ్చేశాడు. 


రమేష్ మెహర్ మంచి హిట్స్ తో కన్నడలో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే టాలీవుడ్ కు ఏ ముహుర్తాన ఎంట్రీ ఇచ్చాడో గానీ ఆయన చేసిన సినిమాలు ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ గా మిగిలాయి. ప్రభాస్ బిల్లా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకుడు కంత్రి, శక్తి, షాడో లాంటి డిజాస్టర్స్ తో నిర్మాతలను ఉలిక్కి పడేలా చేశాడు. అయితే ఇప్పుడు ఈ దర్శకుడికి మహేష్ బాబు పుణ్యమా అని అనుకోని లక్ కలిసొచ్చింది. 

 

షాడో సినిమా డిజాస్టర్ తో డైరెక్టర్ గా ఫేడ్ అవుట్ అయిన రమేష్ మెహర్ కు ఇండస్ట్రీలో గట్టి పరిచయాలే ఉన్నాయి. దాదాపు స్టార్ హీరోలందరితో ఆయనకు క్లోజ్ నెస్ట్ ఉంది. ఆ సాన్నిహిత్యమే ఇప్పుడు ఆయనకు సక్సెస్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం యాడ్స్ చేస్తున్న రమేష్ మెహర్, సరిలేరు నీకెవ్వరు సినిమాతో డిస్ట్రిబ్యూటర్ అవతారం ఎత్తాడు. నాలుగు కోట్లు పెట్టి గుంటూరు ఏరియా రైట్స్ దక్కించుకున్న ఈ దర్శకుడికి లాభాల పంట పండిందని అంటున్నారు. 


సరిలేరు నీకెవ్వరు మొదటి ఆటకే హిట్ టాక్ తెచ్చుకుంది. దీనికి తోడు పండుగ సెలవులు కూడా కలిసొచ్చాయి. దీంతో గుంటూరు లాంటి మాస్ ఏరియాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోందట. తొలి నాలుగు రోజుల్లోనే రమేష్ మెహర్ పెట్టిన పెట్టుబడి రికవరీ అయిపోయినట్టు సమాచారం. ఇప్పటి నుండి వచ్చే మొత్తం ఈ దర్శకుడికి అదనపు లాభమే అంటున్నారు. డిస్ట్రిబ్యూషన్ చేసిన మొదటి సినిమానే బంపర్ హిట్ కావడంతో రమేష్ మెహర్ కెరీర్ న్యూ టర్న్ తీసుకున్నట్టే అనే టాక్స్ వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: