నయనతార.. మురుగదాస్ మళ్లీ మోసం చేశాడంటోంది. లేడీ సూపర్ స్టార్ కి ఈ డైరెక్టర్ మళ్లీ హ్యాండిచ్చాడట. ఆ పొరపాటు ఈ సారి జరుగదని చెప్పి మరోసారి మాట తప్పిన ఈ స్టార్ డైరెక్టర్ పై నయన్ ఫైర్ అవుతోంది. ఇంతకీ మురుగదాస్ పై నయన్ చేస్తున్న కంప్లైంట్ ఏంటో తెలుసా..?

 

35ఏళ్ల నయనతార ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్ అసూయపడే గ్లామర్ తో మాయ చేస్తోంది. అంతేకాదు హీరోయిన్ గా 15ఏళ్ల కెరీర్ కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ క్రేజీ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. పర్సనల్ లైఫ్ లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ బ్యూటీ ప్రొఫెషనల్ లైఫ్ మీద ఏమాత్రం ఎఫెక్ట్ చూపించలేకపోయాయి. అయితే ఎప్పటికప్పుడు నయన్ కు సంబంధించి ఏదో ఒక విషయం కాంట్రవర్శీగా మారుతోంది. 

 

ఇటీవలే దర్బార్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. దర్శకుడు మురగదాస్ పై మండిపడుతోంది. దర్శకులపై ఎప్పుడు మాట జారని ఈ బ్యూటీ మురుగదాస్ మాత్రం తనను మళ్లీ చీట్ చేశాడంటూ బాధపడుతోంది. అప్పట్లో నయన్, మురుగదాస్ డైరెక్షన్ లో గజనీ చిత్రంలో నటించింది. ఆ పాత్రను ఎంతో గొప్పగా చెప్పిన ఈ దర్శకుడు సినిమాలో మాత్రం పేలవంగా చేశాడని ఆ మధ్య కామెంట్ చేసింది. ఇప్పుడు మరోసారి దర్బార్ సినిమాలో అలాగే చేశాడని వాపోతోందట. దర్బార్ సినిమాలో తన పాత్రకు అన్యాయం చేశాడని నయనతార, మురుగదాస్ పై ఫైర్ అవుతోందని వినికిడి. 

 

దర్బార్ లో రజనీకాంత్ వన్ మ్యాన్ షో అనీ.. సినిమాలో నయన్ గ్లామర్ గా కనిపించినప్పటికీ ఆమె పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యత లేదనీ... దీంతో మురగదాస్ పై నయన్ ఫీలవుతోందట. నిజంగానే లేడీ సూపర్ స్టార్ ఫీలవుతోందా.. సోషల్ మీడియాలో కావాలనే పుకార్లు క్రియేట్ చేస్తున్నారా.. అనేది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: