రోజుకు ఒక రకంగా తన రేటును రూపు మార్చుకుంటున్న పసిడి నేడు కూడా బంగారం ప్రియులకు శుభవార్తను మిగిల్చింది. హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర వారం చాలా కిందకి దిగి వచ్చింది సోమవారం 42వేల 50 రూపాయల వద్ద ఉన్న బంగారం ధర శనివారం నాటికి 41,050 రూపాయలకు తగ్గింది.

 

అంటే కచ్చితంగా వెయ్యి రూపాయల కు పడిపోయింది అన్న మాట. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గిపోయింది. అయితే 24 క్యారెట్ బంగారం స్థాయిలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు.

 

వారం ఆరంభంలో 38200 ఉన్న పది గ్రాముల బంగారం ధర శనివారం నాటికి 38090 రూపాయలకు చేరింది అంటే 110 రూపాయలు దిగివచ్చింది అన్నమాట.

 

బంగారం ధర వెలవెలబోతూ ఉంటే కేజీ వెండి ధర మాత్రం ర్యాలీ చేసింది. వారం ఆరంభంలో రూ.49,150 వద్ద ఉన్న వెండి ధర శనివారం చివరకు వచ్చేసరికి రూ.49,400కు ఎగసింది. అంటే వెండి ధర రూ.250 పైకి కదిలింది. ప్రస్తుతం బంగారం ధర తగ్గినా కూడా వచ్చే కాలంలో పసిడి రేటు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: