గ్యాప్ తీసుకున్న రానా కొత్త సినిమా థీమ్ తో క్యూరియాసిటీ పెంచుతున్నాడు. విరాటపర్వం పోస్టర్స్ తో సినిమాపై అంచనాలు రేకెత్తిస్తున్నాడు. రానా చేయబోతున్న గెరిల్లా ఫైట్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తోందని అంటున్నారు. 


టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి, వేణు ఉడుగల దర్శకత్వంలో నటిస్తున్న విరాటపర్వం చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను తెలగు, తమిళ భాషల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. నక్సలిజం నేపథ్యంలో సాగే కథ కావడంతో ఎక్కువ శాతం సన్నివేశాల్ని అడవిలోనే తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళ అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది. 


విరాట పర్వం చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అంచనాలు పెంచేస్తోంది. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యం ఇతివృత్తంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వేణు ఉడుగల మరింత ఆసక్తిగా తెరకెక్కిస్తున్నాడట. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. రానా లుక్, పోలీసులు నక్సలైట్ల మధ్య ఫైట్ కు సంబంధించిన పోస్టర్స్ ఆసక్తిని పెంచేశాయి. 

 

నేనే రాజు నేనే మంత్రి లాంటి సక్సెస్ తర్వాత రానా కెరీర్ కు అనుకోని బ్రేక్ వచ్చింది. అయితే విరాట పర్వం సక్సెస్ ఆ గ్యాప్ మర్చిపోయేలా చేస్తోందని రానా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు సమాచారం. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న విరాటపర్వం రానా కెరీర్ కు కొత్త ఐడెంటిటీ తీసుకొస్తుదంనే టాక్ వినిపిస్తోంది. సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, టబు, ఈశ్వరి రావు, జరీనా వహాబ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన రాణా.. కొత్త సినిమా థీమ్ తో క్యూరియాసిటీని పెంచేస్తున్నాడు. నక్సల్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఆయన నటించే మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళ అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: