జూనియర్ ఎన్టీఆర్ అన్న పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది అతని మాస్ ఇమేజ్. మరొకవైపు త్రివిక్రమ్ అంటేనే కుటుంబ కథా చిత్రాలకు తన క్లాస్ డైలాగులు మరియు స్క్రీన్ ప్లే జోడించి అద్భుతంగా తీసే చిత్రాలు. అయితే వీరిద్దరి కలయికలో ఇంతకుముందు తెరకెక్కిన అరవింద సమేత చిత్రానికి మాత్రం త్రివిక్రమ్ కొంచెం రూటు మార్చాడు. సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో తీసిన గురూజీ పూర్తిగా ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు తగ్గట్లు తన కథను రాసుకున్నాడు.


అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తో 'అల వైకుంఠ పురం లో' చిత్రం ద్వారా తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకునే దిశగా అడుగులు వేస్తున్న త్రివిక్రమ్ మళ్ళీ తన స్ట్రాంగ్ జోన్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ మధ్యకు అడుగుపెట్టాడు. అయితే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్న ఎన్టీఆర్ తర్వాత కచ్చితంగా త్రివిక్రమ్ తో ఒక కూల్ మరియు బ్రీజీ ఫ్యామిలీ చిత్రాన్ని త్రివిక్రమ్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు సమాచారం

 

ఖచ్చితంగా చెప్పాలంటే జనతాగ్యారేజ్ కి ముందు తర్వాత ఎన్టీఆర్ ఖాతాలో ఒక కుటుంబ కథా చిత్రమే లేదు. దీని తర్వాత త్రివిక్రమ్ స్టైల్ లో ఫ్యామిలీ సినిమా చేస్తే బాగుంటుందని ఫీలింగ్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఉంది. అయితే ఫ్యామిలీ చిత్రాల అనేసరికి ఒకే మూసలో పడిపోతున్న త్రివిక్రమ్ ఈసారి కూడా అదే స్టైల్ లో తీస్తే వర్కవుట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. . ఇప్పటికే త్రివిక్రమ్ ఒకే రకమైన టేకింగ్ మరియు డైలాగులు అలవాటుపడిపోయిన ప్రేక్షకులు కచ్చితంగా ఇటువంటి నేపథ్యంలో కథ తీస్తే నిట్టూర్చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: