సుకుమార్ టైటిల్ తోనే స్టోరీ మొత్తం చెప్పేస్తుంటాడు. తాను చెప్పదలుచుకున్న కథ గురించి ముందుగానే హింట్స్ ఇస్తాడు. మేకింగ్ లో మ్యాజిక్ చేస్తూ ఆడియన్స్ ను థ్రిల్ చేస్తాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా స్టోరీ కూడా టైటిల్ తోనే రివీల్ చేస్తున్నాడు. 


సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ కు బోల్డంత క్రేజ్ ఉంది. ఆర్య సినిమాతో తెలుగు ఆడియన్స్ కు ప్రేమలో కొత్త కోణాన్ని చూపించిన ఈ జోడీ నుంచి సినిమా వస్తుందనగానే ఇండస్ట్రీ జనాల్లో కూడా ఆ ప్రాజెక్ట్ పై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు మైత్రీ మూవీ మేకస్ నిర్మాణంలో వీళ్లిద్దరు కలిసి చేస్తోన్న సినిమాపైనా ఇలాంటి అంచనాలే ఉన్నాయి. 

 

సుకుమార్, అల్లు అర్జున్ కలిసి చేస్తోన్ మూడో సినిమాలో సీరియస్ ఇష్యూస్ డిస్కస్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. చిత్తూరు శేషాచలం అడవుల నుంచి అక్రమంగా తరలిస్తోన్న ఎర్రచందనం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందని చెబుతున్నారు. ఈ ప్రచారానికి మరింత బలాన్ని ఇస్తూ.. ఈ మూవికి శేషాచలం అనే టైటిల్ పరిశీలిస్తున్నారనే టాక్ వస్తోంది. 

 

శేషాచలం సినిమాలో కూలీల ఎన్ కౌంటర్లని చర్చిస్తారా లేక.. కూలీలను ముందుపెట్టి కోట్లు దండుకుంటోన్న మాఫియా చరిత్ర కూడా చెప్తాడా అనేది ఆసక్తిగా మారింది. మరి రంగస్థలం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని తెరకెక్కిస్తోన్న ఈ కథలో సుకుమార్ ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తాడు.. బన్నీ మేకోవర్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. 

 

ముఖ్యంగా స్మగ్లింగ్ అనేది దేశానికి పెద్ద చీడ పురుగులా పరిణించింది. ఇలాంటి క్రమంలో ఈ దుశ్చర్యను అరికట్టాల్సిన బాధ్యత సగటు మానవుడితో పాటు ప్రభుత్వంపై కూడా ఉంది. ఈ స్మగ్లింగ్ ను అరికట్టడం వల్ల జరిగే ప్రయోజనాలపై ఈ మూవీ ఉంటుందా.. లేక కూలీలు ఈ దుశ్చర్య వైపు ఎందుకు మళ్లుతున్నారో చూపిస్తారా.. లేక అటవీ సంపద రక్షణ గురించి ఈ మూవీలో చూపించబోతున్నారా అనేది తేలాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: