స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ అల.. వైకుంఠపురములో  ఈసంక్రాంతి సీజన్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈసినిమా విడుదలై ఎనిమిది రోజులవుతున్న ఇప్పటికీ చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. 
 
ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా  వారం రోజుల్లో 107.65  కోట్ల షేర్ ను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.  87 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం తో  ఈ సినిమా కొన్న బయ్యర్లందరూ  లాభాల్లోకి వచ్చారు.  ఫుల్ రన్ లో ఈ చిత్రం మరో 30కోట్ల వసూళ్లను రాబట్టుకోనే అవకాశాలు వున్నాయి.  దాంతో  బాహుబలి  2, బాహుబలి తరువాత  అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో  తెలుగు సినిమా  గా అల.. రికార్డు క్రీయేట్ చేయనుంది. 
 
వారం రోజులకు గాను అల.. వైకుంఠపురములో వసూళ్ల వివరాలు : 
 
నైజాం - 27.6 కోట్లు 
సీడెడ్ - 13 కోట్లు 
ఉత్తరాంద్ర - 13.56 కోట్లు 
గుంటూరు - 8.18 కోట్లు 
తూర్పు గోదావరి - 7.03 కోట్లు 
పశ్చిమ గోదావరి - 6.21 కోట్లు '
కృష్ణా - 6.48 కోట్లు 
నెల్లూరు - 2.89 కోట్లు 
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 7రోజులకు గాను షేర్ = 84.95 కోట్లు 
రెస్ట్ ఆఫ్  ఇండియా - 9.75 కోట్లు 
ఓవర్సీస్ - 12.95కోట్లు 
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా  7రోజులకు గాను షేర్ = 107.65 కోట్లు 
 

మరింత సమాచారం తెలుసుకోండి: