నయనతార... మూడున్న‌ర‌ పదుల వయసు దాటినా సరే వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తమిళంలో వరుస ఆఫర్లతో ఈ భామ ఫుల్ బిజీ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో సీనియ‌ర్ హీరోల‌కు ధీటుగా దూసుకు పోతోన్న న‌య‌న పేరు చెపితే స్టార్ హీరోలు సైతం భ‌య‌ప‌డుతున్నారు. ఓ సినిమాలో న‌టించాలంటే ఆమె పెడుతోన్న కండీష‌న్లు అన్ని ఇన్నీ కావట‌. అయితే ఆమెకు ఉన్న క్రేజ్ నేప‌థ్యంలో ఎవ్వ‌రూ కూడా ఆమెను కాద‌నే ప‌రిస్థితి లేదు.

 

అయితే ఇటీవ‌ల ఆమె సినిమాల్లో న‌టిస్తున్నా ప్ర‌మోష‌న్ల‌కు మాత్రం డుమ్మా కొట్టేస్తోంది. ఆ కండీష‌న్‌కు ఓ కే అయితేనే ఆమె సినిమాలు చేస్తుంది.. లేకుంటే నో చెప్పేస్తోంది. యువ హీరోయిన్లు అంత మంది ఉన్నా సరే ఈ సీనియర్ డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అయితే కొన్ని రోజులుగా ఈ భామకు తెలుగులో ఆఫర్లు తగ్గాయి. ఎప్పుడో మినహా ఆమె కనపడటం లేదు. అసలు దానికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా తెలుగులో స్టార్ హీరోల సరసన చేస్తే తనకు గుర్తింపు ఉండటం లేదనే భావన లో నయన్ ఉన్నట్టు తెలుస్తుంది. 

 

అంతెందుకు ర‌జ‌నీ కాంత్ ద‌ర్బార్ సినిమాలో చేసిన న‌య‌న్ త‌న పాత్ర‌కు ప్రాధాన్యం లేద‌ని మురుగ‌దాస్‌పైనే విరుచుకు ప‌డిన‌ట్టు కూడా వార్త‌లొస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక తెలుగు లో పెద్ద హీరోల ప‌క్క‌న చేసేందుకు కూడా ఆమె స‌వాల‌క్ష కండీస‌న్లు పెడుతోంద‌ట‌. వెంకీ బాబు బంగారం, చిరు సైరాలో చేసేందుకు న‌య‌న్ పెట్టిన కండీష‌న్లు అన్నీ ఇన్నీ కావు. 

 

అయితే అలాంటి న‌య‌న్ బాల‌య్య‌తో చేసేందుకు మాత్రం ఎప్పుడూ ఓకే అంటోంద‌ట‌. ఇటీవ‌ల ఆమెకు స‌న్నిహితుడు అయిన ఓ ద‌ర్శ‌కుడు తెలుగు సినిమాల గురించి ప్ర‌స్తావిస్తే బాలకృష్ణ మినహా ఎవరితోనూ తనకు నటించే ఉద్దేశం లేదని, ఆయన మనుషులకు విలువ ఇస్తారని, ఇతర హీరోల దగ్గర దాదాపుగా అది ఉండద‌ని చెప్పింద‌ట‌. బాల‌య్య‌తో ఆమె సింహా, శ్రీరామ‌రాజ్యం, జై సింహా సినిమాల్లో చేసిన సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: