మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే రంగ‌స్థ‌లం సినిమా బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌టిగా నిలిచింది. ఆ సినిమా కు ముందు వ‌ర‌కు కెరీర్ ప‌రంగా రామ్ చ‌ర‌న్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. రామ్ చ‌ర‌ణ్‌కు న‌ట‌న కూడా రాద‌ని విమ‌ర్శ‌లు చేసిన వాళ్లు సైతం ఆ సినిమాలో న‌ట‌న చూశాక మైంబ్ బ్లాక్ అయ్యి వాళ్ల నోట మాట కూడా రాలేదు.

 

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా చ‌ర‌న్ కెరీర్ రేంజ్‌ను, మార్కెట్ రేంజ్‌ను పూర్తిగా మార్చేసింది. ఇక ఈ సినిమా త‌ర్వాత మెగా ఫ్యామిలీలో ప‌వ‌న్ త‌ర్వాత ఆ ప్లేస్ కోసం పోటీ ప‌డుతోన్న చ‌ర‌ణ్ వ‌ర్సెస్ బ‌న్నీ వార్ కాస్త చెర్రీకి వార్ వ‌న్ సైడే అన్న‌ట్టుగా మారింది. ఇక డీజే, నా పేరు సూర్య లాంటి రెండు ప్లాప్ సినిమాల‌తో రేసులో వెన‌క ప‌డ్డ బ‌న్నీ ఇప్పుడు అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో మ‌ళ్లీ చెర్రీని క్రాస్ చేసేశాడు.

 

అల సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌హేష్‌బాబు స‌రిలేరు, ర‌జ‌నీ ద‌ర్బార్‌ను తునాతునా త‌న‌క‌లు చేస్తూ దూసుకు పోతోంది. ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌రికే అల ఏకంగా ఏపీ, తెలంగాణ‌లో రు.84 కోట్లు, వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు.109 కోట్ల‌తో దూసుకు పోతోంది. రంగ‌స్థ‌లం లాంగ్‌లో సాధించిన రికార్డులు సైతం ఈ సినిమా దెబ్బ‌కు తునాతున‌క‌లు కానున్నాయి.

 

‘అల వైకుంఠపురములో’ ఆంధ్ర – తెలంగాణ ఫస్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:

నైజాం – 26.85 కోట్లు
సీడెడ్ – 12.7 కోట్లు
గుంటూరు – 8.2 కోట్లు
ఉత్తరాంధ్ర – 12.55 కోట్లు
తూర్పు గోదావరి – 7.52 కోట్లు
పశ్చిమ గోదావరి – 5.9 కోట్లు
కృష్ణా – 7.8 కోట్లు
నెల్లూరు – 3.24 కోట్లు
--------------------------------------------
ఫస్ట్ వీక్ మొత్తం షేర్ – 84.86 కోట్లు
--------------------------------------------

కర్ణాటక + ఇండియా – 8 కోట్లు

ఓవర్సీస్ – 16.4 కోట్లు

వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ షేర్ – 109.26 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: