టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (తార‌క్‌) ఎలాంటి పాత్రలో అయినా సరే అవలీలగా పరకాయ ప్రవేశం చేసేస్తాడు. త‌న తాత‌, తండ్రుల నుంచి వ‌చ్చిన వార‌స‌త్వ న‌ట‌న‌తో అటు పౌరాణికం, ఇటు సాంఘీక సినిమాల్లో దేంట్లో అయినా సులువుగా న‌టించేస్తాడు. య‌మ‌దొంగ సినిమాలో యంగ్ మ‌యుడిగా, సింహాద్రి, ఆది సినిమాల్లో ఫ్యాక్ష‌న్ లీడ‌ర్‌గా, స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ సినిమాలో స్టూడెంట్‌గా ఇలా ఏ సినిమాలో అయినా ఏ పాత్ర‌లో అయినా తారక్ ఇట్టే ఒదిగి పోతాడు.

 

ఇక బాబి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ జై లవకుశ సినిమాలో మూడు పాత్రల్లో తారక్ ఒదిగిపోయిన విధానం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రావ‌ణ్ అనే విలన్ గా కూడా జూనియర్ ఆ సినిమాలో మెప్పించాడు... తన హావ భావాలు, తన నటన, తన డైలాగులు ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఎంతగానో మెప్పించాయి. దీంతో తారక్ అప్పటి నుంచి విలన్ పాత్రలు కూడా చెయ్యాలని, మల్టీ స్టారర్ సినిమాలు చెయ్యాలి అనే డిమాండ్ ఎక్కువగా వినపడుతుంది. 

 

ఇక తార‌క్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ పాత్ర నెగటివ్ గానే ఉంటుంది అని అంటున్నారు. ఆదిలాబాద్ ఏజెన్సీలో ఉండి బ్రిటీష‌ర్లు, నిజాం పాల‌న‌పై పోరాటం చేసిన గోండు జాతి వీరుడు కొమ‌రం భీం పాత్ర‌లో తార‌క్ న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఇప్పుడు తారక్ తో నెగటివ్ రోల్ చేయించడానికి బాలివుడ్ దర్శకులు కూడా సిద్దమవుతున్నారనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతుంది. 

 

ఇటీవల కరణ్ జోహార్ హైదరాబాద్ వచ్చి తారక్ ని కలిసినట్టు సమాచారం. తాను త్వరలోనే ఒక సినిమా చేస్తున్నా అని అందులో నెగటివ్ రోల్ ఉంటుందని, ఒకరకంగా విలన్ కన్నా భయంకరమైన పాత్ర అంటూ చెప్పారట. దీనికి తారక్ కూడా తనకు కొంత సమయం కావాలని... త్వరలోనే చెప్తాను అని చెప్పాడట... మరి ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: