టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు ‘రాజకుమారుడు’ మూవీతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  ఈమూవీ తర్వాత మురారి తో తన నటనకు పదును పెట్టారు.  ఇక అతడు, ఒక్కడు మూవీతో సీరియస్ యాక్షన్ జోన్ లో మెప్పించిన మహేస్ బాబు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పోకిరి’ మూవీతో ఓ ట్రెండ్ సృష్టించారు.  పోకిరిలా జులాయి లా ఉండే ఓ యువకుడు ఒక్కొక్క గుండాని తనదైన స్టైల్లో మట్టు పెడుతూ.. ఒక్క సారే పోలీస్ అవతారంలో కనిపించడం ఈ సినిమాలో హైలెట్ ట్విస్ట్ గా ఉంటుంది.   ఆ తర్వాత దూకుడు మూవీతో తనదైన మానరీజంతో కామెడీతో అలరించారు మహేష్ బాబు. 

 

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా చెలామని అవుతున్న మహేష్ బాబు తాజాగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో మంచి విజయం అందుకున్నారు.  ఈ మూవీ వంద కోట్ల క్లబ్ లో చేరినట్లు చిత్ర యూనిట్ తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ మీట్స్ లో బిజీ బిజీగా ఉన్నారు.  ఈ సందర్భంగా మహేష్ బాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ లో ఎప్పటికీ హిందీ చిత్రసీమకు వెళ్లబోనని స్పష్టం చేశారు.

 

ఒకసారి కాదు, వందసార్లు అడిగినా బాలీవుడ్ కు వెళ్లననే చెబుతానని, తెలుగు చిత్ర పరిశ్రమే తనకు సర్వస్వం అని వెల్లడించారు. తన మూలాలు ఉన్నది ఇక్కడేనని, ఇక్కడి ప్రజల ఆశీస్సులే తనకు బలం అని వివరించారు. ప్రస్తుతం టాప్ హీరోలు బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఆ మద్య రామ్ చరణ్ బాలీవుడ్ లో నటించారు.  పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కిస్తున్నారు. అయితే బాలీవుడ్ లో మాత్రం తనకు ఛాన్సులు వచ్చినా నటించే ప్రసక్తి లేదని అంటున్నారు మహేష్ బాబు.  పాన్ ఇండియన్ సినిమా అనే భావన కూడా సరికాదని, ఓ మంచి సినిమా మొదలుపెడితే భాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా అది అన్ని ప్రాంతాలతో కనెక్ట్ అవుతుందని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: