ఘట్టమేదైనా.. పాత్ర ఏదైనా.. నేను రెడీ అంటూ జై లవకుశ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొట్టే డైలాగ్ చూస్తు థియేటర్లో అభిమనులకు పూనకాలే వచ్చేశాయి.. మూడు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ చేసిన మాయ నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు.  కెరీర్ బిగినింగ్ లో బాగా లావుగా ఉన్న ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘యమదొంగ’ మూవీతో చాలా సన్నగా స్మార్ట్ లుక్ తో కనిపించాడు.  ఈ మూవీలో యంగ్ యముడిగా తన నటనతో తాత నందమూరి తారకరామారావుని గుర్తు చేశారు.  ఇలా పాత్రల కోసం తన పర్సనాలిటీ విషయంలో ఎంతో శ్రమకు ఓర్చి ఫిట్ నెస్ సంపాదించాడు.  యమదొంగ సినిమా తర్వాత వరుసగా విజయాలు అందుకుంటున్న ఎన్టీఆర్ తాజాగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్ ’ మూవీలో నటిస్తున్నారు.

 

ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం.1, సింహాద్రి,యమదొంగ సినిమాల్లో నటించారు ఎన్టీఆర్.  ఇప్పుడు నాలుగో సినిమా ఆర్ఆర్ఆర్ లో కూడా ఓ మన్యం వీరుడు పాత్రలో నటిస్తున్నారు.  ఎన్టీఆర్ కొమరం భీం లుక్ పై సెలెబ్రిటీల ఫిజికల్ ట్రైనర్ లియోర్డ్ స్టీవెన్స్ అంచనాలు పెంచేశాడు.తాజాగా స్టీవెన్స్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ సందర్బంగా స్టీవెన్ ట్విట్ చేస్తూ.. ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనింగ్ పూర్తయింది. ఎన్టీఆర్ డెడికేషన్, హార్డ్ వర్క్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు.

 

ఇక ఆర్ ఆర్ఆర్ మూవీలో మన్యం వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ ఇప్పటి వరకు మీరు చూడని విధంగా అదిరిపోతుందని  అంటున్నారు.  అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ తో అదరగొట్టడం వెనుక ఉంది కూడా స్టీవెన్సే. అంతకు మించేలా.. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర ఎన్టీఆర్ లుక్ నిజంగానే ప్రత్యేకంగా ఉంటుందని అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: