సంక్రాంతి కానుకగా విడుదలై అటు క్లాస్, ఇటు మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించుకున్న సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్ర‌మ్ ,బ‌న్నీ కాంబోలో గ‌తంలో వ‌చ్చిన జులాయి, స‌న్నాఫ్‌ సత్యమూర్తి సినిమాల‌ను మించి ఈ సినిమా హిట్ అయ్యింది. దీంతో వీరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ మాత్రమే కాదు అల్లు అర్జున్ కెరీర్లో ఆల్ టైం హిట్ గా నిలిచి 100 కోట్ల క్లబ్ లో చేర్చిన సినిమాగా నిలిచింది.

 

మొదటి ఆరు రోజుల్లో 77.71 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసి పలు ఏరియాల్లో బాబుబలి 2 రికార్డ్ ని నెలకొల్పిన ఈ చిత్రం 7వ రోజు కూడా హౌస్ ఫుల్స్ తో 7.1 కోట్ల షేర్ సాధించింది. దీంతో ఆంధ్ర – తెలంగాణలో84 కోట్ల షేర్ తో అల్లు అర్జున్ అల్ టైం అత్యధిక కలెక్షన్స్ సాధించింది. అల వైకుంఠ‌పురం సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో మెగా ఫ్యామిలీ యువ హీరోల్లో లెక్క‌లు మ‌ళ్లీ మారుతున్నాయి.

 

గ‌తంలో బ‌న్నీ వ‌రుస హిట్ల‌తో ఉన్న‌ప్పుడు చెర్రీ, వ‌రుస ప్లాపుల‌తో రేసులో వ‌న‌క ప‌డిపోయాడు. బ్రూస్ లీ, గోవిందుడు అందరివాడేలే లాంటి మూస సినిమాల త‌ర్వాత ధృవ‌, రంగ‌స్థ‌లంతో బ‌న్నీని క్రాస్ చేశాడు. రంగ‌స్థ‌లం చెర్రీ స్టామినా చాటింది. ఎవ‌డు సినిమాతో మ‌ళ్లీ వెన‌క ప‌డ్డాడు. బ‌న్నీ కూడా నా పేరు సూర్య‌, డీజే లాంటి ప్లాపుల త‌ర్వాత ఈ సినిమాతో సూప‌ర్ రేంజ్‌కు వెళ్లి పోయాడు. దీంతో నిన్న‌టి వ‌ర‌కు చెర్రీతో పోలిస్తే బ‌న్నీ మార్కెట్ డౌన్ అన్న చ‌ర్చ‌లు న‌డిచాయి.

 

ఇక ఇప్పుడు మ‌ళ్లీ లెక్క‌లు పూర్తిగా మారిపోయాయి. బ‌న్నీ ఇప్పుడు మ‌ళ్లీ ఫ‌స్ట్ ప్లేస్‌కు వెళ్లిపోయాడు. మ‌రి చెర్రీ ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మ‌ళ్లీ ఎలాంటి రేంజ్‌కు వెళ‌తాడో ?  చూడాలి. ఏదేమైనా అల దూకుడుతో చెర్రీలో మ‌ళ్లీ టెన్ష‌న్ స్టార్ట్ అయిన‌ట్టు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ గుస‌గుస‌లుగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: