ప్రతి ఏటా జీ సినిమా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమలు ప్రతిభ చాటిన వారందరికీ జీ సినిమా అవార్డ్స్ వస్తూ ఉంటాయి. ఇక ఈ అవార్డు ఫంక్షన్ కి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అతిరథమహారధులు హాజరవుతూ  ఉంటారు. ఇక ఈ అవార్డు ఫంక్షన్ కోసం అటు బుల్లితెర ప్రేక్షకుల తో పాటు వెండితెరపై కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే జీ సినిమా అవార్డ్స్ అంటే అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ లు..  అదిరిపోయే గెస్ట్  అపిరియన్స్ లు ..  తెలుగు ప్రేక్షకులందరికీ ఫుల్ టైమ్ ఎంటర్ టైన్మెంట్ అందుతుంది .కాగా  ఇంకొన్ని రోజుల్లో జీ సినిమా అవార్డ్స్ ఈవెంట్ జరగనుంది. అయితే జీ సినిమా అవార్డ్స్ కి సంబంధించిన ఓ ప్రోమోని విడుదల చేసింది జీ తెలుగు. ఈ ప్రోమో లో  తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 

 

 ఈ ప్రోమో చూస్తుంటే ఆద్యంతం   అందరికీ ఆసక్తి కలిగించేలా ఉంది. చూస్తున్నంత సేపు ఎప్పుడెప్పుడు ఈ ఈవెంట్ ప్రసారం అవుతుంద అని  ఆసక్తి కలుగుతుంది. ఈ సినిమాలో ఎంతో మంది స్టార్స్ కనిపించి అద్భుతం గా అలరించారు. ఇస్మార్ట్ శంకర్ టీం ఎనేర్జిటిక్  స్టార్ రామ్.. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ వేరువేరుగా స్టేజ్ పై  ఇచ్చిన పర్ఫామెన్స్ అదుర్స్ అనిపిస్తోంది.యాంకర్ రవి ప్రదీప్ ల  మధ్య పంచులు కూడా అదిరిపోయి  ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇస్మార్ట్ శంకర్ టీం అంతా ఫంక్షన్ లో రచ్చరచ్చ చేసేస్తుంది. పూరి జగన్నాథ్, రామ్ నిధి అగర్వాల్, చార్మి ఇలా మొత్తం జీ  సినిమా అవార్డ్స్ స్టేజి పైన సందడి చేశారు. స్టేజి మీదికి వచ్చిన సమంతను యాంకర్ ప్రదీప్.. పంచులు వేస్తూ కాసేపు టీస్  చేశారు. ఏ మాయ చేసావే  సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి అందరికీ మాయ  చేసేశారు  అంటూ ఆట పట్టించారు ప్రదీప్. 

 


 జీ సినిమా అవార్డ్స్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిరంజీవి ఫంక్షన్ మొత్తానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అంతేకాకుండా యంగ్ హీరో కార్తికేయ మెగాస్టార్  కు ట్రిబ్యూట్ గా  ఒక స్పెషల్ ప్రదర్శన ఇచ్చినట్లు ప్రోమోలో  తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా సాంగ్ తో అద్భుతమైన ప్రదర్శన చేశారు కార్తికేయ. అయితే కార్తికేయ తన పర్ఫామెన్స్ అనంతరం ఇచ్చిన స్పీచ్ లో ఎమోషనల్ గా మాట్లాడాడు. తన 27ఏళ్ల జీవితంలో ఈ ఒక్క రోజే అద్భుతమైనది అంటూ కార్తికేయ ఎమోషనల్ అయ్యాడు. చిరంజీవి గారికి చరణ్ మాత్రమే కొడుకు కాదని తామంతా ఆయన పిల్లలమె  అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ మాటలు విన్న చిరు కళ్ళల్లో నీళ్ళు కనిపించాయి . ఇక చివర్లో వెళ్ళి మెగాస్టార్ కాళ్లకు నమస్కరించాడు యువ హీరో కార్తికేయ. ప్రోమో అంతా  అందరిలో ఆసక్తి రేకెత్తించేలా అదిరిపోయేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: