టాలీవుడ్ హీరోలకు కాస్త సెంటిమెంట్లు ఎక్కువ‌న్న విష‌యం తెలిసిందే. సినిమా ప్రారంభం ద‌గ్గ‌ర నుంచి గుమ్మ‌డికాయ కొట్టేవ‌ర‌కు ప్ర‌తిది ముహూర్తం చూసుకునే మొద‌లు పెడ‌తారు. ఇక‌పోతే కొన్ని సీజ‌న్లు కొంత మందికి క‌లిసొస్తాయి. కొంత మందికి క‌లిసిరావు. కొంత మంది హీరోల‌కి పండ‌గ‌ల సీజ‌న్ బాగా క‌లిసొస్తాయి. కొంత మందికి క‌లిసిరావు ఇక ఇదిలా ఉంటే...ఇక ఈ సంక్రాంతికి విడుద‌లైన  సూపర్ స్టార్ మహేష్ బాబు విషయమే తీసుకుంటే సమ్మర్ సీజన్లో మహేష్ కు మంచి హిట్లు ఉన్నాయి కానీ సంక్రాంతి సీజన్ మహేష్ కు పెద్దగా కలిసిరాలేద‌నే చెప్పాలి.

 


2013 లో సంక్రాంతి సీజన్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుస విడుద‌లై అఖండ విజ‌యాన్ని సాధించింది.  కానీ సినిమా భారీ హిట్ అయితే కాదు. పోటీలో రిలీజ్ అయిన రామ్ చరణ్ 'ఎవడు' తో కలెక్షన్స్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది.  ఇక 2014 సంక్రాంతికి విడుదలైన '1- నేనొక్కడినే' సినిమా గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు మ‌హేష్ కెరియ‌ర్‌లోనే డిజాస్టర్ గా నిలిచింది.  ఈ ఏడాది సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' రిలీజ్ అయింది.  బ్లాక్ బస్టర్ అయిన‌ట్లు ఆ చిత్ర యూనిట్‌ ప్రచారం చేసుకుంటున్నారు కానీ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చెయ్యలేదని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. అలాగే ఓవ‌ర్సీస్ మార్కెట్ మొత్తం డ‌ల్ అయిన‌ట్లు కూడా స‌మాచారం. మహేష్ సంక్రాంతి సినిమాల పరిస్థితి పస తక్కువ ప్రచారం ఎక్కువ అన్నట్టుగా ఉందని.. అసలు సంక్రాంతి మహేష్ కు కలిసిరాలేదని కొంద‌రు అంటున్నారు.

 

నిజ‌నిజాలను ప‌క్క‌న పెట్టి ఉన్న‌దానికంటే ఎక్కువ క‌లెక్ష‌న్స్‌ను చూపిస్తూ కాస్త ఎక్కువ‌గానే ప్ర‌చారం చేసుకుంటున్న‌ట్లు ఉంది. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌రోప‌క్క మ‌హేష్ ఇమేజ్ కూడా దెబ్బ‌తింటుంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.  సోషల్ మీడియా అంతా... మా సినిమా హిట్టు హిట్టు అంటే అది హిట్టు అని నమ్మడం లేదు. పది సక్సెస్ మీట్లు పెట్టినా హిట్టు అని నమ్మడం లేదు. నిజమేంటో ప్రేక్షకులకు ఎవరూ చెప్పకుండానే అర్థం అవుతోంది. అస‌లు స‌క్సెస్ అనేది డిస్ట్రిబ్యూట‌ర్లు బ‌య్య‌ర్లు సంతోషంగా ఉన్న‌ప్పుడే హిట్ అంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: