దర్శకుడు బోయపాటి అంటే బాలయ్య తో తీసిన సింహ, లెజెండ్ సినిమాలే ముందు అందరికి గుర్తొస్తాయి. ఆ సినిమాలు బాలయ్యకి బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చాయి. అయితే గ‌త ఏడాది వ‌చ్చిన అద్భుతాలలో ఎన్టీఆర్ బ‌యోపిక్ మహానాయకుడు, కథానయుడు, అలాగే విన‌య‌విధేయరామ‌.. సినిమాలు భారీ అంచనాలతో రిలీజయ్యాయి. 2019 ఆరంభంలోనే సంక్రాంతి సీజ‌న్లో పోటీ పడి ఈ సినిమాలు విడుద‌ల అయ్యాయి. అయితే ప్రేక్షకులు నుండి ఎలాంటి రెస్పాన్స్ వ‌చ్చిందో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్ బ‌యోపిక్ ను భారీ బ‌డ్జెట్ తో రూపొందించారు. తండ్రి పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టించారు. అయితే ఆ సినిమాలు భారీ డిజాస్టర్స్ కావడమే కాదు బాలయ్య ఇమేజ్ మొత్తాన్ని దెబ్బకొట్టాయి. 

 

ఎన్టీఆర్ ఇలాంటి నటుడులా అంటూ ప్రేక్ష‌కులే బీతరపోయి బెదిరిపోయారు. ఆ స్థాయిలో వ‌చ్చింది ఎన్టీఆర్ బ‌యోపిక్ పార్ట్ వ‌న్ ఔట్ పుట్! ఇక ఎన్టీఆర్ ను గొప్ప‌వాడిగా చూప‌డానికి కొన్ని అబ‌ద్ధాల‌ను కూడా చూపించార‌నే విమ‌ర్శ‌లూ వచ్చి పడ్డాయి. ఏ ర‌కంగా చూసుకున్నా.. విశ్వ న‌ట‌సార్వ‌భౌముడి స్థాయికి ఏ మాత్రం సూటవలేదు. ఆ సినిమా వ‌చ్చి ఏడాది అయ్యిందంటూ... వారం నుంచి నెట్ లో ట్రోలింగ్ మొదలైంది. అప్ప‌ట్లో ఆ సినిమాపై పెట్టిన సెటైరిక్ పోస్టుల‌ను నెటిజ‌న్లు ఇప్పుడు షేర్ చేస్తున్నారు. ఏడాది అయ్యిందంటూ..కళాఖండం గురించి కామెడీగా మాట్లాడుకుంటున్నారు.

 

అలాగే అదే సీజ‌న్లో వ‌చ్చిన బోయ‌పాటి మార్కు క‌ళాఖండం విన‌య‌విధేయ‌రామ కూడా వీజవంతంగా వన్ ఇయర్ కంప్లీటయింది. బోయ‌పాటి సినిమాలో కొన్ని ఎన్నోహాస్యాస్ప‌ద‌మైన సీన్లు ఉన్నాయి. వాటిని షేర్ చేస్తున్నారు జ‌నాలు. అప్ప‌ట్లోనే ఆ సీన్లు న‌వ్వుల‌పాల‌యిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఆ సీన్స్ నెట్ లో స్పూఫ్ గా హల్ చల్ చేస్తున్నాయి. మొత్తానికి ఒక సినిమా హిట్ అయితే అది విడుద‌లై ఏడాది అంటూ పోస్టులు పెట్టేవారు. కానీ ఇలా ఫ్లాపయిన సినిమాల‌ను కూడా జ‌నాలు ట్రోల్ చేస్తున్నారంటే పరిథితులు ఎలా మారుతున్నాయో చూడండి. అయితే ఎన్టీఆర్ బ‌యోపిక్, విన‌య విధేయ రామ.. ఈ రెండు  సినిమాలూ  మాత్రం ఏడాదైనా సెటైర్ ల‌కు ఎప్పుడు ఛాన్స్ ఉందనిపిస్తోంది. మరి ఇప్పటి నుంచైనా ఇలాంటి సినిమాలని తీసి పరువు పోగొట్టుకోకపోతే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: