అల్లు అర్జున్‌తో మరోసారి డీసెంట్‌ సినిమా అందించిన త్రివిక్రమ్‌కి ఈసారి తమన్‌ అందించిన అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌ తోడవడంతో పాటు సంక్రాంతి కూడా కలిసి రావడంతో తన కెరీర్‌లో, అల్లు అర్జున్‌ కెరీర్‌లో అతి పెద్ద విజయాన్ని 'అల వైకుంఠపురములో'తో అందుకున్నాడు. అల్లు అర్జున్‌తో ఎప్పుడు చేసినా కానీ అన్ని జాగ్రత్తలు తీసుకునే త్రివిక్రమ్‌ 'అజ్ఞాతవాసి' విషయంలో మాత్రం పవన్‌ అభిమానులని మోసం చేసాడు.

 

పవన్‌ రాజకీయాల్లోకి వెళ్లే ముందు త్రివిక్రమ్‌ తీసిన ఆ అతి దారుణమయిన చిత్రం అభిమానులని క్షోభకి గురి చేసింది. అరవింద సమేతకి, అల వైకుంఠపురానికి చూపించిన జాగ్రత్త అప్పుడేమయిందంటూ ఫాన్స్‌ చిరుబుర్రులాడుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌కు ఆయ‌న చాలా న‌ష్టం చేశాడ‌ని వారు ఫైర్ అవుతున్నారు. ఇక‌పోతే త్రివిక్ర‌మ్‌కు కాపీ క్యాట్ అన్న పేరు కూడా ఉన్న విష‌యం తెలిసిందే. ఒక్కోసారి ప‌క్క చిత్రాల క‌థ‌ల‌ను కాపీ కొడితే. ఒక్కోసారి త‌న సినిమాలోని కొన్ని స‌న్నివేశాల‌ను కాపీ చేసి తీసేస్తూ ఉంటారు.  ఏ ద‌ర్శ‌కుడికైనా స‌రే ఎన్ని హిట్ చిత్రాలు  వ‌చ్చిన ఒక్క ఫ్లాప్ వ‌చ్చిందంటే చాలు ఫ్యాన్స్ ఆడేసుకుంటారు.

 

అందులోనూ ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియా బాగా పెరిగిపోవ‌డంతో ఇది మ‌రి కాస్త ఎక్కువయింద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ బ‌న్నీతో క‌లిసి తీస‌ని అల‌వైకుంఠ‌పురంలో చిత్రం స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీని త‌ర్వాత త్రివిక్ర‌మ్ ఇప్పుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించే పింక్ చిత్రం రీమేక్‌కి డైలాగ్స్‌ను అందిస్తున్నార‌ని ఫ‌స్ట్ టాక్ వ‌చ్చినా ప్ర‌స్తుతం అది క్యాన్సిల్ అయింద‌ని స‌మాచారం. ఇప్పుడు ఆయ‌న జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి ఆర్.ఆర్.ఆర్ చిత్రం త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా రానుంద‌ని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. మ‌రి ఈ ప్రాజ‌క్ట్ పై ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. ఒక‌వేళ ఇది ముందుకెళ్ళినా దీనికి చాలా టైం అయితే ప‌ట్టేట‌ట్టే ఉంది. ఆర్.ఆర్.ఆర్ హ‌డావుడి అయితే గాని ఎన్టీఆర్ త్ర‌విక్ర‌మ్ వైపుచూడ‌రు. ఈ లోపు త్రివిక్ర‌మ్ గ్రౌండ్ వ‌ర్క్ స్టార్ట్ చేసి స్క్రిప్ట్‌ను త‌యారు చేసుకునే ప‌నిలో ఉంటే బెట‌ర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: