టాలీవుడ్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ ఇటీవల కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రూలర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడం జరిగింది. అయితే ఆ సినిమా ఆశించిన రేంజ్ లో ఆడలేదు. నిజానికి గత ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలుగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలపై ఎంతో నమ్మకం పెట్టుకున్న బాలయ్యకు అవి రెండూ కూడా ఫెయిల్ అయి, ఆయన ఆశలు నిరాశలు చేసాయి. ఇక ఇటీవల నటించిన రూలర్ కూడా దెబ్బతినడంతో తదుపరి బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోయే సినిమాపై బాలయ్య గట్టిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 

 

ఇకపోతే నేడు బాలయ్య గుండె చేయించుకుని తెల్ల రంగు ఖద్దరు దుస్తులతో టిడిపి పార్టీ నాయకులకు దర్శనమిచ్చారు. అయితే ఆ సమయంలో అక్కడి కొందరు, బాలయ్య లుక్ ని ఫోటో తీసి సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ లుక్ లో బాలయ్యని చూసి, ఈ సరికొత్త గుండు బాస్ లుక్ లో బాలయ్య అదిరిపోయారు అంటూ కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు బాలయ్య ఈ గుండు లుక్ పై టాలీవుడ్ లో కొంత చర్చ కూడా జరుగుతోంది. సడన్ గా ఆయన ఈ విధంగా గుండు చేయించుకున్నది బోయపాటి సినిమా కోసమేనని, ఎందుకంటే బోయపాటి సినిమాలో రెండు పాత్రలలో నటిస్తున్న బాలయ్య

 

అందులో ఒక పాత్రకు సంబందించిన ఒక సీన్ కోసం సహజత్వంతో కనపడాలని ఉద్దేశ్యంతోనే గుండు చేయించుకున్నారని అంటున్నారు. అలానే ఆ సినిమా కోసం ఇప్పటికే ఆయన 15 కేజీలకు పైగా బరువు తగ్గారని, గతంలో బాలయ్య బోయపాటిల కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలను మించేలా ఈ సినిమా తెరకెక్కుతోందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సారి బాలయ్య ఫ్యాన్స్ మాత్రం బోయపాటిపై గట్టి నమ్మకాలే పెట్టుకున్నారని చెప్పాలి. మరి బోయపాటి ఆ నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: