టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా సినిమాలైన సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో సినిమాలు రెండూ కూడా కేవలం ఒకే ఒక్క రోజు గ్యాప్ లో ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తో, అలానే అద్భుతమైన కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు సినిమాలు కూడా ఇప్పటికే రూ.100 కోట్ల పైచిలుకు షేర్ ని కూడా అందుకుని ఆయా సినిమాల నిర్మాతలని అతి త్వరలో లాభాల బాటలోకి తీసుకెళ్లనున్నాయి. అయితే ఈ రెండు సినిమాల విషయం లోనే కాక 2018లో సరిగ్గా భరత్ అనే నేను, నా పేరు సూర్య సినిమాల విషయంలో కూడా ఈ ఇద్దరు హీరోల సినిమాల రిలీజ్ విషయమై కొద్దిపాటి వివాదం జరుగగా, 

 

రెండు సినిమాల నిర్మాతలు రాజీకి వచ్చి, రెండు సినిమాలను ఫైనల్ గా 15 రోజుల గ్యాప్ తో రిలీజ్ చేయడం జరిగింది. ఇక వాటిలో భరత్ అనే నేను సూపర్ డూపర్ హిట్ కొట్టగా, నా పేరు సూర్య ఫ్లాప్ అయింది. అయితే ఇప్పుడు రిలీజ్ అయి ముందుకు సాగుతున్న సరిలేరు, అల సినిమాల వాస్తవమైన టాక్ గురించి చెప్పాలంటే, సరిలేరు తో పోలిస్తే అల సినిమాలో గతంలో త్రివిక్రమ్ సినిమాల్లోని కొన్ని సీన్స్ ని కాపీ కొట్టి తీసిన కిచిడి మాదిరిగా ఉన్నప్పటికీ కూడా, ఒకింత పైచేయితో మంచి టాక్ తో ముందుకు సాగుతుందనే చెప్పాలి. ఇక ఈ రెండు హీరోల ఫ్యాన్స్ మధ్య అయితే గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్ జరుగుతూనే ఉంది. ఇక నిన్న అది మరింత తారా స్థాయికి చేరి, ఒకరి హీరోలపై మరొకరు నెగటివ్ ట్యాగ్స్ తో ట్విట్టర్ మొత్తం హోరెత్తించడం జరిగింది. అయితే ఈ వివాదంపై కొందరు సినీ విశ్లేషకులు స్పందిస్తూ, ఈ రెండు సినిమాలు బాగానే ఆడుతున్నాయి, 

 

అలానే ఆ ఇద్దరు హీరోలు కూడా వివాదరహితులు, అది తెలిసి కూడా మధ్యలో ఈ ఫ్యాన్స్ మాత్రమే ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారని, కావున ఇకపై ఇటువంటివి చేయవద్దని కోరుతున్నారు. ఇక ఈ వివాదంపై తమిళ హీరో సిద్దార్థ తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ ఇద్దరు హీరోలపై యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్న నెగటివ్ ట్యాగ్స్ ని పోస్ట్ చేసిన సిద్దార్థ, అసలు టాలీవుడ్ లో ఏమి జరుగుతోంది, ఈ విధంగా అవతలి హీరోలపై మనం బురద జల్లడం సిగ్గుగా లేదా అంటూ పోస్ట్ చేయడం జరిగింది. అయితే సిద్దార్ధ ట్వీట్ పై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు, వాళ్ళేదో మేము గోపంటే మేము గొప్ప అని తెలిసీ తెలియక వాదించుకుంటుంటే, మధ్యలో నువ్వెందుకు వేళ్ళు పెడుతున్నావ్ బెదరూ, ఎందుకంటే ఇద్దరు హీరోల సినిమాలు బాగానే ఆడుతున్నాయనే విషయం అందరికి తెలుసు, కనుక నువ్వు కూడా ఈ మ్యాటర్ వదిలేయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: