చెన్నై బ్యూటీ శృతిహాసన్ బౌన్స్ బ్యాక్ అవుతోందా.. కమల్ గారాల పట్టి న్యూ జనరేషన్ స్పీడ్ తట్టుకొని రేసులో నిలబడుతోందా.. హిట్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్న శృతిహాసన్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతోందా..!


సక్సెస్ కోసం పడిగాపులు కాసిన శృతిహాసన్ గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తో హీరోయిన్ గా నిలదొక్కుకుంది. ఆ తర్వాత బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్స్ తో స్టార్ లీగ్ లోకి ఎంటర్ అయింది. తెలుగులో వరుస సక్సెస్ లతో బిజీగా ఉండగానే కోలీవుడ్, బాలీవుడ్ లోనూ బిగ్ ఛాన్స్ లు పట్టేసింది. శృతిహాసన్ టాప్ లీగ్ లోకి వెళ్లడం ఖాయమనుకునే టైమ్ లోనే ఈ బ్యూటీ రాంగ్ స్టెప్ వేసి కెరీర్ ని మధ్యలోనే బ్రేక్ చేసుకుంది.

 

కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న టైమ్ లో శృతిహాసన్ లవ్ లో పడి కెరీర్ ని పాడుచేసుకుంది. ఫారెన్ బాబు మైకెల్ కోర్సేలే మాయలో పడి సినిమాలకు దూరమైంది. బ్రేకప్ తర్వాత ఈ బ్యూటీ యూటర్న్ తీసుకొని సినిమాలపై ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పుడు రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్స్ హవా సాగుతోంది. మరి ఈ యంగ్ జనరేషన్ బ్యూటీస్ హవా తట్టుకొని శృతి గ్లామర్ తో మాయ చేయగలదా.. సక్సెస్ కొట్టి హీరోయిన్ గా మళ్లీ బిజీ అవుతోందా.. అనేది బిలియన్ మార్క్ క్వశ్చన్ గా మారింది. 

 

రవితేజ హీరోగా నటిస్తున్న క్రాక్ సినిమాతో శృతిహాసన్ రీ ఎంట్రీ ఇస్తోంది. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై చెన్నై బ్యూటీ బోలెడు ఆశలు పెట్టుకుంది. గతంలో కాంబినేషన్ లో వచ్చిన బలుపు సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో మరోసారి ఆ మ్యాజిక్ వర్కవుట్ అవుతోందని శృతి ఆశలు పెట్టుకుంది. మరి చెన్నై బ్యూటీ ఆశలను క్రాక్ మూవీ ఎంత వరకు నిజం చేస్తోందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: