బాలీవుడ్ ప్లే బాయ్ అర్జున్ కపూర్ అనుష్క శర్మని టార్గెట్ చేశాడు. ఈ బీటౌన్ హీరో చేసిన సెటైర్స్ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడో ఏదొక న్యూస్ తో హైలెట్ అయ్యే అర్జున్ కపూర్ అనుష్కపై చేసిన కామెంట్స్ బీటౌన్ లో హల్ చల్ చేస్తున్నాయి. 


కెరీర్ లో హిట్స్ లేకపోయిన అర్జున్ కపూర్ మాత్రం ఎప్పుడు హాట్ టాపిక్కే. సరదాగా, చలాకీగా ఉండే అర్జున్ కపూర్ చమత్తారం కూడా ఎక్కువే. ఎవరి మీదైనా ఈజీగా సెటైర్లు వేయడం ఈ యంగ్ హీరో స్పెషాలిటీ. గతంలో చాలామంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మీద సెటైర్లు వేసి కామెడీ చేసిన అర్జున్ కపూర్ లేటెస్ట్ గా స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ మీద వేసిన సెటైర్లు వైరల్ అవుతున్నాయి. 

 

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ తన ఇంట్లో బాల్కనీలో కూర్చొని టీ తాగుతున్న ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. సూర్య కిరణాలను ఎదురుగా టీ తాగుతూ కనిపిస్తున్న ఈ ఫోటో.. తీపి గురుతుగా మిగిలిపోతుందని పోస్ట్ చేసింది. అంతేకాకుండా నాకు ప్రియమైన వ్యక్తి ఈ ఫోటో తీశాడని క్యాప్షన్ కూడా పెట్టింది. దీనికి అర్జున్ కపూర్ ఫన్నీ కామెంట్స్ తో ఆటపట్టించాడు. 

 

ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలో అనుష్క శర్మ.. టీషర్టు, జాగర్ తో పాటు కాళ్లకు సాక్స్ వేసుకుంది. దీనిపై అర్జున్ కపూర్ రియాక్ట్ అవుతూ.. సాక్స్ డ్రై వాష్ చేశావ్ మరి. టాప్ వేశావా.. అని కామెంట్ చేశాడు. అర్జున్ సెటైర్ కు అనుష్క సాక్స్ ఉతికేస్తామా అంటూ రియాక్ట్ అయింది. అర్జున్ కపూర్ చిలిపి సెటైర్ ను నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు. జీరో తర్వాత అనుష్క శర్మ మరో సినిమాలో నటించలేదు. అర్జున్ కపూర్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: