టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ల జర్నీ క్లైమాక్స్ కు వస్తోంది. ఒకప్పుడు భారీ హిట్స్ తో హంగామా చేసిన హీరోయిన్లు ఇప్పుడు కెరీర్ ను కాపాడుకోవడానికి చాలా కష్టపడుతున్నారట. ఓ వైపు సీనియారిటీకి తగ్గ కథలు దొరక్క.. మరోవైపు స్టార్ హీరోలను ఇంప్లెస్ చేయలేక సతమతమైపోతున్నారు. 


విజయశాంతి, టబు లాంటి వాళ్లు హీరోయిన్స్ గా రిటైర్ అయినా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తూనే ఉన్నారు. విజయశాంతి అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా వసూళ్లు పెరగడానికి తన వంతు సాయం చేసింది. టబు అల వైకుంఠపురములో సందడి చేసింది. అయితే వీళ్లు ఇంత హంగామా చేస్తున్న థర్టీ ప్లస్ లో ఉన్న అనుష్క, కాజల్ లాంటి వాళ్లు మ్యాజిక్ చేయలేకపోతున్నారు. 

పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనుష్కకి ఇప్పుడు సరైన అవకాశాలే రావట్లేదు. చాలా కష్టపడి సైజ్ జీరో బరువు తగ్గించుకున్నా.. స్వీటికి కమర్షియల్ సినిమాల్లో ఆఫర్స్ రావట్లేదు. అనుష్క కటౌట్ కు మేం సెట్ అవ్వమని యంగ్ స్టర్స్ దూరం జరుగుతుంటే.. సీనియర్ హీరోలు కూడా ఈమెను పక్కన పెట్టేస్తున్నారు. దీంతో నిశ్శబ్దం లాంటి సినిమాలతో కెరీర్ నెట్టుకొస్తోంది జేజెమ్మ. 


మిల్కీ గ్లామర్ తో మెరుపులు మెరిపించే తమన్నా.. కెరీర్ ఇప్పుడు స్లంపులో ఉంది. బాహుబలి ది బిగినింగ్ తర్వాత సరైన హిట్ లేని తమ్మూ ఫేడవుట్ కి దగ్గరైపోతోంది. అర్జంట్ గా హిట్ కొట్టకపోతే లగేజ్ సర్దుకొనే పరిస్థితిలో పడిపోతోంది. ప్రస్తుతం గోపీచంద్ తో కలిసి నటిస్తోన్న సిటీమార్ రిజల్ట్ పైనే ఈమె కెెరీర్ ఆధారపడి ఉందని చెప్పొచ్చు. 

 

ఏ ఫీల్డ్ అయినా సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ ప్రమోషన్స్ వస్తుంటాయి. కానీ సినిమా ఫీల్డ్ లో మాత్రం హీరోయిన్స్ సీనియర్లు అవుతున్ారంటే ఆఫర్లు తగ్గిపోతుంటాయి. సీనియర్ భామలు అనే ట్యాగ్ తో వాళ్లని పక్కన పెట్టేస్తుంటారు మేకర్స్. ఈ ఇదిలోనే హాట్ గాళ్స్ కూడా డేంజర్ జోన్ లో పడిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: