యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్. జె సూర్య మొదటి సినిమా వాలి. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీ, సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీసిన నాని సినిమాలతో సంచలం సృష్ఠించారు. నాని డిజాస్టర్ గా సూర్య పాపులర్ అయితే అజిత్-సిమ్రన్ ల వాలి, పవన్ కళ్యాణ్-భూమికల ఖుషీ సినిమాలతో బాగా ఫేమస్ అయ్యారు. కేవలం డైరెక్టర్ గానే కాదు నటుడిగాను తనలోని డిఫ్రెంట్ యాంగిల్ చూపించి సంచలనం అవుతున్నారు. ఇక సూర్య ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.  మహేష్ స్పైడర్ సినిమాలో భైరవుడు గా భయంకరమైన విలనిజం తో ఆకట్టుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఆ సినిమాలో మహేష్ బాబుకి ఎంతగా పేరొచ్చిందో విలన్ గా సూర్య నటనకు అంతగా పేరొచ్చి విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. 

 

ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా  కొనసాగుతున్న రోజుల్లోనే నటనమీద ఉన్న ఆసక్తితో నటుడిగా మారి పెద్ద సక్సెసైన ఎస్.జె.సూర్య ప్రస్తుతం కోలీవుడ్ సహా టాలీవుడ్ హీరోలకు విలన్ గా నటించేందుకు సిద్దంగా ఉన్నాడు. ఇదంతా బాగానే ఉన్నప్పటికి కొన్ని అనవసరమైన కారణాలతో ఈ మధ్య సూర్య పేరు కాంట్రవర్సీ కావడం సంచలనమవుతోంది. ఎస్. జె సూర్య ఒక హీరోయిన్ ని ప్రేమిస్తున్నానంటూ.. వేధిస్తున్నాడని కోలీవుడ్ మీడియాలో వార్తలు రావడం హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ ని సూర్య ప్రేమించినట్లు..ఆ ప్రేమను ప్రియాభవాని తీరస్కరించారని ఓ వార్త అంతటా వైరల్ గా మారింది. తాజాగా ఈ వివాదంపై సూర్య స్పందిస్తూ సీరియస్ అయ్యాడు. కొందరు ఫూల్స్ పనిగట్టుకుని తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసాడు. ప్రియాభవానీకి ఐలవ్ యూ చెప్పినట్లు... దాన్ని ఆమె తిరస్కరించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. 

 

అసలు మా గురించి ఆ ఫూల్స్ కి ఏం తెలుసు... అందుకే ఈ విషయంలో అందరికి క్లారిటి ఇస్తున్నాను. 'మాన్ స్టర్' సినిమాతో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహాన్ని కొందరు తప్పుగా అర్ధం చేసుకుని ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటి నుంచి అలాంటి రాతకి పుల్ స్టాప్ పెట్టమని తెలిపాడు.  'మాన్ స్టర్' తర్వాత ప్రియా భవానీకి సూర్య వెంటనే మరో ఆఫర్ ఇవ్వడంతో రకరకాల పుకార్లు మొదలయ్యాయి. 'బొమ్మై' అనే సినిమాలో ప్రస్తుతం ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా ప్రియ భవానీ పేరును సూర్య రికమెండ్ చేశాడని ప్రచారమైంది. ఆ తర్వాత వరుస గాసిప్పులు వచ్చి కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.  అయితే ఈ విషయంపై ప్రియభవాని మాత్రం ఇంకా మీడియా ముందుకు వచ్చి క్లారిటి ఇవ్వలేదు. సూర్య లాగే తను కూడా వచ్చి క్లారిటి ఇస్తే ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: