తెలుగమ్మాయిలకు ఇండస్ట్రీలో ఛాన్స్ ఇవ్వరంటూ ఎప్పటి నుంచో ఒక అపవాదు ఉంది. అలాంటి వాటి నడుమ ఒక్కసారిగా దూసుకొచ్చిన వరంగల్ అమ్మాయి ఈషా రెబ్బా. అచ్చ తెలుగమ్మాయి అయిన ఈషా డైరెక్టర్ ఇంద్రగంటొఇ మోహన కృష్ణ స్టూడెంట్ అని చెప్పాలి. ఆయన సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా రాగల 24 గంటలు సినిమాతోను ఆకట్టుకుంది. ఇక ఆ తెలుగమ్మాయి గట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందానికి అందం, అభినయం ఉన్న కథానాయికగా ఈషా రెబ్బ మంచి గుర్తింపును తెచ్చుకుంది. మోడ్రన్ ట్రెండ్స్ ని ఫాలో అవడంలోను .. గ్లామర్ ఎలివేషన్ కి అడ్డు చెప్పని హీరోయిన్ గాను బాగా పాపులరవుతోంది. స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించనప్పటికి తార సినిమా అరవింద సమేత లో ఒక లీడ్ రోల్ లో నటించి ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈషా రెబ్బా స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య కాలంలో రెగ్యులర్ హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేయడమే కాదు అసలు ఈషా తెలుగమ్మాయేనా అన్న అనుమాలు వచ్చేలా ట్రెండిగా సందడి చేస్తోంది.

 

ఇక సినీ ఇండస్ట్రీలో మీటూ వ్యవహారాలపై సూటిగా మాట్లాడే ధైర్యం ఉన్న ఈషా రెబ్బాకు ఉందని ఇంతకుముందు తన కామెంట్స్ చూసిన ఎవరికైనా అర్థమవుతాయి. సూటిగా ఏదైనా మాట్లాడేస్తే.. ముఖం చాటేసే మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఈషా డేర్ కి ప్రశంసలు దక్కాయి. అయితే ఇలాంటి డేర్ చూపిస్తే తనకు మరో అవకాశం వస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే అన్ని సందేహాలకు చెక్ పెట్టేస్తూ ఈషా ను వెతుక్కుంటూ వస్తున్న మేకర్స్ కూడా తక్కువేం లేరు. వరుసగా గ్యాప్ లేకుండా ఈషాకి ఛాన్స్ ఇచ్చే మేకర్స్ బాగానే ఉన్నారు. 

 

ఇక ఇషా రెబ్బా కేవలం తెలుగులోనే కాదు బాలీవుడ్ లోను తన లక్ చెక్ చేసుకోబోతోంది. అందులో భాగంగా బాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు గట్టి ప్రయత్నాల్లో ఈషా ఉందని తాజా సమాచారం. ముంబై పరిశ్రమ నుంచి ఇషాకు ఒక బంపర్ ఆఫర్ వచ్చిందని లేటెస్ట్ అప్‌డేట్. బాలీవుడ్ సీనియర్ హీరో అనీల్ కపూర్ వారసుడు హర్షవర్ధన్ కపూర్ సరసన సోషల్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలో ఆఫర్ అందుకుంది. బాలీవుడ్ ఫిలింమేకర్ రాజ్ సింగ్ చౌదరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈషా ఈ సినిమాలో రాజస్థానీ అమ్మాయిగా కనిపించనుందట. మహిళా సాధికారతను.. స్త్రీ శక్తిని ఎలివేట్ చేసే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందట. ఇందులో నావెల్టీ ఉన్న పాత్రలో ఈషాకు నటించేందుకు ఎక్కువగా ఆస్కారం ఉందని తెలుస్తోంది. ఎస్.ఆర్.కే అనే సినిమాతో ఈషా కన్నడ రంగంలోనూ అడుగుపెడుతోంది. అలాగే తమిళంలోనూ ఓ సినిమాలో నటిస్తోంది. ఇవి కాకుండా వెబ్ సిరీస్ లోను బోల్డ్ క్యారెక్టర్ చేస్తున్నట్లు ఆమధ్య వార్తలు వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: